July 14, 2026

IND vs ENG: అయ్యో.. ఎంత పనైంది! కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!

IND vs ENG: అయ్యో.. ఎంత పనైంది! కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
Reading Time: 2 minutes
IND vs ENG: అయ్యో.. ఎంత పనైంది! కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. అది కూడా మామూలు వికెట్లు కాదు.. నిలబడితే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్లు. ఇంతకీ ఎవరంటే.. ఇంకెవరు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. చాలా కాలం తర్వాత టీమిండియా తరఫున బరిలోకి దిగిన ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తమ అభిమానులను దారుణంగా నిరాశపరిచారు. వారి ఆట చూసేందుకు ఎంతో మంది చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌ కోసం ఈగర్‌గా వేయిట్ చేస్తున్నామంటూ రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా హడావిడి కూడా కనిపించింది.

కానీ, అభిమానుల ఆశలుపై నీళ్లు చల్లుతూ ఇద్దరు ప్లేయర్లు కూడా తక్కువ స్కోర్‌కే అవుటై నిరాశపర్చారు. రోహిత్ శర్మ 21 బంతుల్లో ఒక ఫోర్‌తో 11, విరాట్ కోహ్లీ 6 బంతుల్లో ఒక ఫోర్‌‌తో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. తొలుత సామ్ కరన్ బౌలింగ్‌లో కెప్టెన్ హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ పెవిలియన్ చేరగా, ఆ వెంటనే విరాట్ కోహ్లీ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ బాగా ఆడుతున్నా.. ఈ సీనియర్ ప్రోస్ మాత్రం ఎందుకో ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నిజానికి ఇంగ్లాండ్ ఇంత మంచి స్కోర్ చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే.. కేవలం 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా ఇంగ్లాండ్ అద్బుతంగా కమ్ బ్యాక్ ఇచ్చింది. సీనియర్ ప్లేయర్ జో రూట్ చివరి వరకు క్రీజ్‌లో పాతుకుపోయాడు. 76 బంతుల్లో 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో లియామ్ డాసన్ కూడా అద్భుతంగా పోరాడాడు. 83 బంతుల్లో 68 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు మంచి స్కోర్ అందించాడు. అలాగే బెన్ డకెట్ 43 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 4, బ్రార్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే చెరో వికెట్ తీసుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి