July 14, 2026

Mrunal Thakur: మృణాల్ – రిషబ్ పంత్ మధ్య ‘సంథింగ్ సంథింగ్’?.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే ఒక్క ‘ఫాలో’తో మొదలైన రచ్చ!

Mrunal Thakur: మృణాల్ - రిషబ్ పంత్ మధ్య 'సంథింగ్ సంథింగ్'?.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే ఒక్క 'ఫాలో'తో మొదలైన రచ్చ!
Reading Time: 2 minutes

Mrunal Thakur: మృణాల్ – రిషబ్ పంత్ మధ్య ‘సంథింగ్ సంథింగ్’?.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే ఒక్క ‘ఫాలో’తో మొదలైన రచ్చ!

Caption of Image.

నెట్టింట చిన్న క్లూ దొరికితే చాలు.. అస్సులు ఊరుకోరు నెటిజన్లు . చిన్న విషయాన్ని కొండంత కథ అల్లేస్తారు. అది కాస్త వైరల్ అయి పెద్ద చర్చకు దారి తీస్తుంది. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. లేటెస్ట్ గా టాలీవుడ్ ‘సీతా రామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్, ఇండియన్ డ్యాషింగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో చేసుకోవడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో మీమ్స్, రూమర్స్ సునామీ సృష్టిస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ నెటిజన్లు అప్పుడే గుసగుసలు మొదలుపెట్టేశారు.

ఆ ఒక్క ‘ఫాలో’ వెనుక ఇంత కథ ఉందా?

నెటిజన్లు ఊరికే ఉండకుండా గాలించి మరీ ఒక క్రేజీ విషయాన్ని బయటపెట్టారు. రిషబ్ పంత్ తన సోదరి సాక్షి పంత్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఏకైక మహిళ మృణాల్ ఠాకూర్ మాత్రమేనట. ఈ ఒక్క పాయింట్ దొరకడమే ఆలస్యం..  సోషల్ మీడియా లవర్స్ క్రియేటివిటీకి రెక్కలొచ్చేశాయి. ఇద్దరి మధ్య ఏదైనా స్పెషల్ బాండింగ్ మొదలైందా? కొత్త సెలబ్రిటీ జంటగా మారబోతున్నారా? అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడే వీళ్లిద్దరి ఫోటోలను కలిపి క్రేజీ ఎడిట్స్ చేయడం, బ్యాక్‌గ్రౌండ్‌లో లవ్ సాంగ్స్ పెట్టేసి వైరల్ చేయడం మొదలుపెట్టారు.

పాత లవ్ ట్రాక్‌ల దుమారం..

గతంలో వీళ్లిద్దరికీ ఉన్న రూమర్ల హిస్టరీ కూడా ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రిషబ్ పంత్‌ను ఉద్దేశించి నటి ఊర్వశి రౌతేలా చేసిన సోషల్ మీడియా పోస్టులు, వారి మధ్య నడిచిన కోల్డ్ వార్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, అవన్నీ రూమర్స్ మాత్రమేనని ఊర్వశి తర్వాత కొట్టిపారేసింది. అటు మృణాల్ ఠాకూర్ కూడా కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో లవ్‌లో ఉందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని నెలల పాటు గట్టిగా ప్రచారం సాగింది. ఆ రూమర్లను మృణాల్ నవ్వేసి కొట్టిపారేసినప్పటికీ, ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారంటూ మరికొన్ని గాసిప్స్ వినిపించాయి.

ALSO READ : రామ్ చరణ్-ఉపాసన కొత్త లగ్జరీ ఫామ్‌హౌస్..

 సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతుందా?

మన దేశంలో సినిమా-క్రికెట్ జోడీలకు ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ, కేఎల్ రాహుల్ – అతియా శెట్టి తరహాలోనే ఇప్పుడు ‘మృణాల్ – రిషబ్’ కొత్త జోడీ కాబోతున్నారా? అంటూ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. ఇది కేవలం ఒక క్యాజువల్ సోషల్ మీడియా ఫాలోనా? ఏదైనా కొత్త యాడ్ షూట్ లేదా బ్రాండ్ కొల్లాబరేషన్ కోసమా? లేక నిజంగానే ఒక కొత్త ‘లవ్ స్టోరీ’కి ఇన్‌స్టా వేదికగా శ్రీకారం చుట్టారా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే మరి.

 

©️ VIL Media Pvt Ltd.