సూర్య రీఎంట్రీకి బీసీసీఐ కండీషన్.. ఇక నిర్ణయం అతని చేతుల్లోనే!

Suryakumar Yadav: భారత క్రికెట్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపి, టైటిల్‌ను అందించిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై సెలెక్టర్లు వేటు వేశారు. ప్రపంచకప్ ముగిసిన వెంటనే ప్రకటించిన ఇండియన్ టీమ్ నుంచి సూర్యను తప్పించింది. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 2028లో జరగబోయే టీ20 ప్రపంచకప్ ఉండటంతో.. అప్పటి వరకు యంగ్ టీమ్ ని డెవలప్ చేసేందుకు బీసీసీఐ యోచిస్తుంది. దీంతో సూర్య అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే అని క్రీడా పండితులు చెబుతున్నారు.
సూర్యకుమార్ రీఎంట్రీపై బీసీసీఐ క్లారిటీ:
సూర్యకుమార్‌ను ప్రస్తుత సిరీస్‌లకు పక్కన పెట్టినప్పటికీ, అతని కోసం టీమిండియా తలుపులు మూసుకుపోలేదని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. భవిష్యత్తులో అతను జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్‌లో రన్స్ వరద పారించాల్సి ఉంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సూర్యకుమార్ సెలెక్టర్ల తక్షణ ప్రణాళికల్లో లేనప్పటికీ, ముంబై తరఫున దేశవాళీ టోర్నీలలో స్థిరంగా భారీ స్కోర్లు చేస్తే అతడ్ని మళ్లీ తుది జట్టులోకి సెలక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ వయసులో తిరిగి ఫామ్ అందుకోవడంతో పాటు గత ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడం సూర్యకు పెద్ద సవాల్‌గా మారే ఛాన్స్ ఉంది.
సూర్య ఫామ్ గ్రాఫ్ ఇదే:
గత కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్ అంత ఆశాజనకంగా కనిపించడం లేదు.. గతేడాది ఆడిన19 ఇన్నింగ్స్‌లలో అతను ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అనంతరం న్యూజిలాండ్ సిరీస్‌లో 3 అర్ధసెంచరీలతో ఫామ్‌లోకి వచ్చి, ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే 84 రన్స్ తో రాణించినప్పటికీ.. ఆ తర్వాత 8 మ్యాచ్‌లలో కేవలం 158 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఫైనల్ మ్యాచ్‌లో డకౌట్ కావడం కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి. వీటికి తోడు ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన 13 ఇన్నింగ్స్‌లలో కేవలం 270 రన్స్ మాత్రమే చేయడంతో సెలెక్టర్లు అతడ్ని పక్క పెట్టి యంగ్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇచ్చారు.
ALSO READ : ఒకే స్టేడియం.. ఒకే మ్యాచ్.. మాట్లాడుకోని గంభీర్, కోహ్లీ..
సూర్య లేని భారత్.. విజయాల కోసం తంటాలు:
మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించిన తర్వాత భారత్ స్టేడియంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. సూర్య లేని మిడిలార్డర్ చాలా బలహీనంగా మారడంతో ఇండియన్ టీమ్ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో కనీసం ఒక్కసారి గెలవలేకపోయింది. గ్రౌండ్ లో జట్టును నడిపించడంతో పాటు కీలక సమయాల్లో వేగంగా రన్స్ చేయడంలో సూర్య అనుభవం ఎంత అవసరమో ఈ ఓటములు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి.