July 14, 2026

Avengers Doomsday: 5 నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్స్.. థియేటర్లలోకి రాకముందే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ రికార్డుల వేట!

Avengers Doomsday: 5 నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్స్.. థియేటర్లలోకి రాకముందే 'అవెంజర్స్: డూమ్స్‌డే' రికార్డుల వేట!
Reading Time: 2 minutes

Avengers Doomsday: 5 నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్స్.. థియేటర్లలోకి రాకముందే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ రికార్డుల వేట!

Caption of Image.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాపై మరోసారి భారీ హైప్ నెలకొంది. ఈ మూవీవిడుదలకు ఇంకా ఐదు నెలల సమయం ఉండగానే.. డిస్నీ తీసుకున్న కీలక నిర్ణయం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. లేటెస్ట్ హాలీవుడ్ నివేదికల ప్రకారం.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియం ఫార్మాట్ టికెట్లను ముందుగానే విక్రయించేందుకు డిస్నీ సిద్ధమవుతోంది.

అమెరికాలో జూలై 20 నుంచే ఈ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ప్రీమియం టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా డిస్నీ ప్రత్యేకంగా రూపొందించిన ‘ఇన్ఫినిటీ విజన్ (Infinity Vision) స్క్రీన్ల కోసం ఈ అడ్వాన్స్ బుకింగ్స్ తెరవనున్నట్లు సమాచారం. ఇటీవల వార్నర్ బ్రదర్స్ తమ ‘డ్యూన్: పార్ట్ III’ కోసం ఐమ్యాక్స్ స్క్రీన్లను ముందుగానే బ్లాక్ చేయడంతో..  దానికి పోటీగా డిస్నీ ఈ కొత్త ప్రీమియం ఫార్మాట్‌ను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఈ సినిమా రన్ టైమ్ దాదాపు 2 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని టాక్. దీంతో  ఇది సఅవెంజర్స్: ఇన్ఫినిటీ వార్స (149 నిమిషాలు) కంటే ఎక్కువ, కానీ  ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ (181 నిమిషాలు) కంటే కొద్దిగా తక్కువ నిడివి కలిగిన చిత్రంగా నిలవనుంది.  దీర్ఘ నిడివి కారణంగా కథలో భారీ యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలు, అనేక మంది సూపర్ హీరోల పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

అంతేకాదు, సెప్టెంబర్ 25 నుంచి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ప్రత్యేక రీ-రిలీజ్‌కు కూడా ఇన్ఫినిటీ విజన్ టికెట్లను విక్రయించనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 2.8 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన ‘ఎండ్‌గేమ్’, ఇప్పటికీ ‘అవతార్’తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా కొనసాగుతోంది.

ఇక మరో ఆసక్తికరమైన ప్రచారం ఏమిటంటే, టికెట్ల అమ్మకాలకు ముందే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ తొలి టీజర్ లేదా ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే జూలై 25న ప్రారంభమయ్యే శాన్ డియాగో కామిక్-కాన్ వేదికగా మార్వెల్ ఈ సినిమాపై మరిన్ని కీలక అప్‌డేట్లు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ALSO READ : Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్

ఆంథోనీ రుస్సో, జో రుస్సో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, మార్వెల్ సినీ విశ్వంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని అభిమానులు భావిస్తున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించనున్నారనే అంశం ఇప్పటికే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే టికెట్ల విక్రయం, ట్రైలర్ విడుదలపై డిస్నీ లేదా మార్వెల్ స్టూడియోస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ గురించి చర్చలు రోజురోజుకూ మరింత ఊపందుకుంటున్నాయి.

 

©️ VIL Media Pvt Ltd.