Reading Time: < 1 minute

‘జురాసిక్ పార్క్’ సినిమా.. హీరో సామ్ నీల్ ఇకలేరు

Caption of Image.

సిడ్నీ: ‘జురాసిక్ పార్క్’ సినిమాల్లో డాక్టర్ అలన్ గ్రాంట్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్ సామ్ నీల్ (78) సోమవారం కన్నుమూశారు. సిడ్నీలో ఓ ఆస్పత్రిలో ఆప్తుల మధ్య ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబం వెల్లడించింది. ఉత్తర ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌లో జన్మించిన సామ్ నీల్ చిన్న వయసులోనే న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి అక్కడే పెరిగారు. 1977లో విడుదలైన స్లీపింగ్ డాగ్స్ చిత్రంతో నటుడిగా గుర్తింపు పొందారు. 1993లో స్టీవెన్ స్పీల్‌‌‌‌‌‌‌‌బర్గ్ దర్శకత్వం లో వచ్చిన జురాసిక్ పార్క్ చిత్రంలో డాక్టర్ అలన్ గ్రాంట్ పాత్రతో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదిం చారు. 2022లో ఆయనకు థర్డ్ స్టేజ్‌‌‌‌‌‌‌‌ బ్లడ్‌‌‌‌‌‌‌‌ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 

©️ VIL Media Pvt Ltd.