July 14, 2026

మాజీ డీజీపీ భద్రత తగ్గింపుపై బిషప్స్ మండలి ఆందోళన..యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

మాజీ డీజీపీ భద్రత తగ్గింపుపై బిషప్స్ మండలి ఆందోళన..యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
Reading Time: < 1 minute

మాజీ డీజీపీ భద్రత తగ్గింపుపై బిషప్స్ మండలి ఆందోళన..యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ స్వరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జిత్ సేన్ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడంపై గ్లోబల్ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కౌన్సిల్ ప్రకారం స్వరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జిత్ సేన్ ఉమ్మడి ఏపీలో దాదాపు మూడు దశాబ్దాల పాటు కొనసాగిన నక్సలిజం నిర్మూలనలో కీలక పాత్ర పోషించారు. నల్లమల అడవులు, అరకు లోయ వంటి ప్రమాదకర ప్రాంతాల్లో పోలీసు బలగాలకు నాయకత్వం వహించి అనేక ఆపరేషన్లు నిర్వహించారని పేర్కొంది.

ఈ నేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ్యంలో ఆయనకు కల్పిస్తున్న భద్రతను అకస్మాత్తుగా తగ్గించడం వల్ల, ఇతర నేరగాళ్ల నుంచి ముప్పు పెరిగే అవకాశం ఉందని మండలి ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర పోలీసు శాఖకు అధిపతిగా పనిచేసిన తొలి ప్రొటెస్టంట్ క్రైస్తవ అధికారిగా స్వరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జిత్ సేన్ సేవలు విశిష్టమైనవన్నారు. భద్రత తగ్గింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకుని, గతంలో ఉన్న భద్రతను యథాతథంగా కొనసాగించాలని గ్లోబల్ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.

©️ VIL Media Pvt Ltd.