ఎవడబ్బ సొమ్మని ఫుట్ పాత్లు కబ్జా చేస్తున్నారు..? డిబేట్కు దారి తీసిన బెంజ్ కార్ పార్కింగ్ ఇష్యూ !

ఇండియాలో పార్కింగ్ ఇష్యూ ఎంతలా ఉంటుందో దాదాపు వెహికిల్ లేని వాళ్లు కూడా ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే.. సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నా.. ఎవరో రోడ్డుపైన కారో, ఆటోనో, బైకో పార్క్ చేస్తే.. దాంతో దారి సరిగ్గా లేక ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియకుండా ఉండలేరు. ఇదిలా ఉంటే నడిచే వాళ్ల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లు ఎప్పటికీ నడిచే వాళ్లకు అందుబాటులో ఉండవు. కొన్ని ఇండ్ల ఓనర్లు కబ్జా చేయడం లేదంటే.. వాహనాల పార్కింగ్ కోసం వాడుకోవడం చూస్తుంటాం. ఇది ఇండియాలో దాదాపు అన్ని సిటీల్లోనూ ఇదే పరిస్థితి. లేటెస్టుగా బెంగళూరులో ఒక మెర్సిడస్ బెంజ్ కారు పార్కింగ్ ఇష్యూ మరోసారి డిబేట్ క్రియేట్ చేసింది.
బెంగళూరులో ఫుట్‌పాత్‌లపై అక్రమ పార్కింగ్, రోడ్ల దుస్థితిపై ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా పదేపదే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. రీసెంట్ గా ఒక బెంజ్ కారు ఓనర్..ఫుట్ పాత్ ను కబ్జా చేసి.. నో ఎంట్రీ అన్నట్లుగా క్లోజ్ చేశాడు. ఆ ఇమేజ్ ను షేర్ చేస్తూ.. షేమ్ లెస్ బిహేవియర్.. నో సివిక్ సెన్స్ అంటూ ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ గా మారింది. పార్కింగ్ ఇష్యూపై పెద్ద డిబేట్ ను క్రియేట్ చేసింది.
పార్కింగ్ వివాదంపై స్పందిస్తూ.. లగ్జరీ కార్ల యాజమాన్యం కూడా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి పాదచారులకు ఇబ్బంది కలిగించడంపై కిరణ్ మజుందార్-షా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) చేపట్టిన ‘సేఫ్ ఫుట్‌పాత్’ (Safe Footpath) క్యాంపెయిన్‌లో భాగంగా ఫుట్ పాత్ ల ఆక్రమణల నుంచి రక్షించాలని చెప్పారు.
►ALSO READ | ప్రపంచ దేశాలకు పిడుగులాంటి వార్త: హార్మూజ్ మళ్లీ క్లోజ్.. జలసంధిలో ప్రయాణించాలంటే 20 శాతం ట్యాక్స్
గతంలోనూ ఆమె బెంగళూరు నగర రోడ్ల అధ్వాన స్థితిపై పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. రోడ్ల దుస్థితి వల్ల ట్రాఫిక్ జామ్‌లు విపరీతంగా పెరిగిపోవడంపై ఆమె ప్రశ్నించారు. ఒకసారి ఆమె ఏకంగా తన లగ్జరీ కారును రోడ్డుపైనే వదిలేసి నమ్మ మెట్రోలో ప్రయాణించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఈ వివాదాలు బెంగళూరులో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై, నగర ప్రజలకు పబ్లిక్ స్పేస్ ఎంతవరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై పెద్ద చర్చకు దారితీశాయి.
బెంగళూరు సిటీలో నెలకొన్న ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యల గురించి కిరణ్ మజుందార్-షా పోస్ట్ కు భారీ స్పందన వచ్చింది. ఇది కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితం కాదని.. ఇండియా వ్యాప్తంగా ఇదే పరిస్థితి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇండియాలో వాహనాలు పెరుగుతున్నాయి .. పార్కింగ్ ప్లేస్..?
గత రెండు దశాబ్దాలుగా, ఇండియాలో వెహికిల్స్ ఓనర్స్ పెరిగిపోతున్నారు. ఆదాయ మార్గాలు పెరగటం.. ఈజీగా లోన్లు రావడం, విస్తరిస్తున్న రోడ్ల నెట్‌వర్క్‌ల కారణంగా లక్షలాది కొత్త కార్లు, బైకులు వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. అయితే దురదృష్టవశాత్తు, పార్కింగ్ మౌలిక సదుపాయాలు ఆ స్థాయికి అనుగుణంగా అభివృద్ధి చెందలేదు.
ట్రాఫిక్ నియమాలను పట్టించుకోక పోవడం..
అక్రమ పార్కింగ్‌కు ఎల్లప్పుడూ స్థలం లేకపోవడమే కారణం కాదు. చాలా మంది డ్రైవర్లు కొద్ది దూరం నడవాల్సిన సమీపంలోని పార్కింగ్ గ్యారేజీలో పార్క్ చేయడానికి బదులుగా, రోడ్డుపైన పార్క్ చేసి వెళ్తుంటారు. డబుల్ పార్కింగ్ చేయడం, డ్రైవ్‌వేలను అడ్డుకోవడం, జీబ్రా క్రాసింగ్‌లపై పార్క్ చేయడం, బస్ స్టాప్‌లను ఆక్రమించడం, ఇరుకైన వీధుల్లో వాహనాలను వదిలివేయడం వంటివి చేస్తుంటారు. దీంతోనే అసలు సమస్య.
భవిష్యత్ డిమాండ్‌ను ఊహించలేని పట్టణ ప్రణాళిక :
ఇండియాలోని నగరాలు వేగంగా అభివృద్ధి చెందాయి. కాని మౌలిక సదుపాయాల విషయంలో వెనుకబడ్డాయి. దాదాపుగా పార్కింగ్ నిబంధనలు లేకుండానే లేదా కాలనీలు సిటీలు డెవలప్ అయ్యాయి. బిల్డర్లు తరచుగా స్టిల్ట్ పార్కింగ్‌ను కమర్షియల్ స్పేస్ గా లేదా అపార్ట్‌మెంట్లుగా మార్చేస్తుండటం పార్కింగ్ సమస్య మరింత ఎక్కువవుతోంది.
మజుందర్ షా గత కొంత కాలంగా ఇండియాలోని రోడ్లు, ట్రాఫిక్, పార్కింగ్ తదితర ఇష్యూస్ పై వరుస పోస్టులు చేస్తున్నారు. సిటీలు అంటే రోడ్లు, ఫ్లై ఓవర్లు డెవలప్ చేయడం కాదు.. భవిష్యత్ తరాలకు అనుగుణంగా పార్కింగ్ సదుపాయాలు, ఫుట్ పాత్ మొదలైన అన్నింటిలోనూ ప్లానింగ్ చేయాలని సూచిస్తున్నారు. షా వాదనతో ఏకీభవిస్తున్న వారు.. ఇండియాలో మౌళిక సదుపాయాల కల్పనలో ఇంకెప్పుడు డెవలప్ అవుతుందోనని కామెంట్స్ చేస్తున్నారు.
Shameless behaviour! No civic sense https://t.co/OB2uaHhBQy
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 5, 2026