July 14, 2026

బయటపడిన షాబాద్ నిందితుడి లేఖ.. నాలుగు పేజీల బాండ్ పేపర్పై ఏం రాశాడంటే..

బయటపడిన షాబాద్ నిందితుడి లేఖ.. నాలుగు పేజీల బాండ్ పేపర్పై ఏం రాశాడంటే..
Reading Time: < 1 minute

బయటపడిన షాబాద్ నిందితుడి లేఖ.. నాలుగు పేజీల బాండ్ పేపర్పై ఏం రాశాడంటే..

Caption of Image.

హైదరాబాద్: పోక్సో కేసు నిందితుడు, కట్టుకున్న భార్య, కన్న పిల్లలతో సహా ఆరుగురిని హత్య చేసిన కిరాతకుడు రాజ్ కుమార్ చావు తర్వాత ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అతని సెల్ఫీ వీడియో ఒకటి వైరల్ అవుతుండగా.. ఇప్పుడు చనిపోయే ముందు అతను రాసినట్టుగా చెబుతున్న ఒక నోట్ వైరల్ అవుతోంది. బాండ్ పేపర్పై తన చావుకు నలుగురు కారణమని రాసిన రాజ్‌కుమార్‌.. మొత్తం నాలుగు పేజీల లేఖను రాశాడు. ఈ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియాకు విడుదల చేశారు. జూలై 10 తేదీన ఈ లేఖ రాసినట్లు సమాచారం.

ప్రేమ వ్యవహారం పేరుతో బ్లాక్‌మెయిల్‌కు గురయ్యానని లేఖలో రాజ్ కుమార్ ఆరోపించాడు. డబ్బుల కోసం నిరంతరం వేధింపులకు గురి చేశారని రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించాడు. ఆసుపత్రి ఖర్చుల కోసం లక్షల రూపాయలు ఇచ్చానని లేఖలో తెలిపాడు. రూ.4 లక్షల లోన్ తీసుకుని కూడా డబ్బులు ఇచ్చానని చెప్పుకొచ్చాడు. పలువురు బంధువులు కలిసి మానసిక వేధింపులకు గురిచేశారని లేఖలో ఆరోపించాడు. 

►ALSO READ | షాబాద్‌ ఘటన: అందుకే వాళ్లను చంపేశా.. ఆరు హత్యలకు ముందు నిందితుడి సెల్ఫీ వీడియో !

పెళ్లి చేసుకోకపోతే కేసులు పెడతామని బెదిరించారని రాసుకొచ్చాడు. ఇల్లు తగలబెడతామని, చంపేస్తామని హెచ్చరించారని తెలిపాడు. తీవ్ర మానసిక ఒత్తిడితో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు లేఖలో రాజ్ కుమార్ ప్రస్తావించాడు. శంషాబాద్‌కు పిలిచి రూ.5 లక్షలు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతామని బెదిరించారని ఆరోపించాడు. శామీర్‌పేట్ పోలీసులతో పరిచయాలున్నాయని బెదిరించారని, చివరికి రూ.50 లక్షలు డిమాండ్ చేశారని బాలిక కుటుంబంపై నిందితుడు సంచలన ఆరోపణలు చేశాడు.

డబ్బులు ఇచ్చినా కేసులు పెడతామని బ్లాక్‌మెయిల్ చేశారని, తన కుటుంబం నాశనానికి ఈ వేధింపులే కారణమని రాజ్ కుమార్ రాసుకొచ్చాడు. తన చావుకు నలుగురు వ్యక్తులే కారణమని రాజ్ కుమార్ ఆరోపించాడు. అయితే.. ఈ నోట్‌లో చేసినవి ఆరోపణలు మాత్రమేనని, అధికారిక దర్యాప్తులో నిజానిజాలు తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.