July 14, 2026

సచ్చాక కూడా ఛీ కొట్టిన సొంతోళ్లు, సొంతూరు.. అనాథగా మిగిలిన రాజ్ కుమార్ డెడ్ బాడీ.. చేవేళ్ల శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు !

సచ్చాక కూడా ఛీ కొట్టిన సొంతోళ్లు, సొంతూరు.. అనాథగా మిగిలిన రాజ్ కుమార్ డెడ్ బాడీ.. చేవేళ్ల శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు !
Reading Time: < 1 minute

సచ్చాక కూడా ఛీ కొట్టిన సొంతోళ్లు, సొంతూరు.. అనాథగా మిగిలిన రాజ్ కుమార్ డెడ్ బాడీ.. చేవేళ్ల శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు !

Caption of Image.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఆరు హత్యలు చేసిన దుర్మార్గుడు, పోక్సో కేసు నిందితుడు రాజ్‌కుమార్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం ముగిసింది. రాజ్‌కుమార్‌కి, తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు రాతపూర్వకంగా రాసి ఇచ్చి వెళ్లిపోయారు. గ్రామంలోకి రాజ్ కుమార్ మృతదేహం రానివ్వమని గ్రామ పెద్దలు కూడా పోలీసులకు తేల్చి చెప్పారు. దీంతో.. చేవెళ్ల స్మశాన వాటికలోనే రాజ్‌కుమార్‌ అంత్యక్రియలకు పోలీసులు ఏర్పాట్లు చేయించారు.

నిందితుడు రాజ్ కుమార్ ఎవరిని ఎలా చంపాడంటే.. శుక్రవారం రాత్రి సెల్ఫ్‌‌ డ్రైవ్‌‌ కారు తీసుకున్నాడు. రాత్రి 11.10  గంటలకు బాలిక ఇంటికి వచ్చాడు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. తలుపు కొట్టడంతో బాలిక తల్లి డోర్‌‌‌‌ ఓపెన్ చేసింది. బాలికను తనతో లాక్కెళ్లే ప్రయత్నం చేయడంతో తల్లి అడ్డుపడింది. దీంతో తన చేతిలో కత్తితో కడుపు, ఛాతిలో ఆరు పోట్లు పొడిచాడు. నిద్రిస్తున్న బాలిక నాయనమ్మ రుక్కమ్మను పొడిచి చంపాడు. అరిస్తే చంపేస్తానని బెదిరిస్తూ.. బాలికను బలవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు.

►ALSO READ | బయటపడిన షాబాద్ నిందితుడి లేఖ.. నాలుగు పేజీల బాండ్ పేపర్పై ఏం రాశాడంటే..

సమీపంలోని అఖిల్‌‌సాగర్‌‌‌‌ చెరువు వద్ద ఆమె గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం దైవాలగూడలోని తన ఇంటికి వెళ్లాడు. తలుపు తట్టడంతో భార్య డోర్ ఓపెన్ చేసింది. దీంతో ఆమెపై దాడి చేసి కడుపులో బలంగా మూడు పోట్లు పొడిచాడు. అరవకుండా గొంతుకోశాడు. పక్కనే బెడ్‌‌పై నిద్రిస్తున్న పరీక్షిత్, దైవీక్షిత్‌‌ గొంతులు కోశాడు.  ఇలా రాత్రి 11.10 గంటల నుంచి 11.45 గంటల మధ్య సమయంలో కేవలం అరగంట వ్యవధిలో ఆరు ప్రాణాలను తీశాడు.

©️ VIL Media Pvt Ltd.