
న్యూఢిల్లీ: ఆప్ఘానిస్తాన్తో జరుగుతోన్న మూడు మ్యాచుల టీ20 సిరీస్ వేళ టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. ఈ నెల చివర్లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు కూడా అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహం నెలకొంది. పక్కటెముకల గాయంతో వరుణ్ చక్రవర్తి ఆప్ఘాన్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఆసియా క్రీడలకు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో తొడ కండరాల గాయానికి గురైన వరుణ్ చక్రవర్తి ఇటీవలే కోలుకున్నాడు. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతోన్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 13) జరిగిన తొలి టీ20లో నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఈ మ్యాచులో ఘన విజయం సాధించింది.
►ALSO READ | ట్రోఫీ కంటే దేశమే ముఖ్యం.. ఆసియా కప్ టైటిల్ వివాదంలో హార్మన్ సేనకు అండగా BCCI
గాయం నుంచి కోలుకుని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన చక్రవర్తి మళ్లీ వెంటనే ఇంజ్యూరీ కావడంతో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో గాయాల నిర్వహణ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గాయం కారణంగా ఇప్పటికే పేసర్ హర్షిత్ రాణా ఆప్ఘాన్ టీ20 సిరీస్, ఆసియా క్రీడలకు దూరమైన విషయం తెలిసిందే. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్లు నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఇటీవల గాయాల నుంచి కోలుకుని జట్టులోకి రావడం టీమిండియాకు శుభపరిణామం.