
ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ జాను లిరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన డ్యాన్సులు, పాటలలో ప్రయాణంలో ఎదురైన సవాళ్లను, సాధించిన విజయాలను పంచుకున్నారు. ఆమె 2000కు పైగా ఫోక్ సాంగ్స్‌కు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆమె ప్రయాణం చిన్న మొత్తంలో మొదలైంది. “నేను ఈవెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు రూ.1500 నుంచి స్టార్ట్ చేశాను. కొన్నిసార్లు రూ.1000 కూడా తీసుకున్నాను,” అని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే, తన కృషి, అంకితభావం ఫలితంగా ఆమె రెమ్యూనరేషన్ పెరిగింది. “ఇప్పుడు ఒక సాంగ్‌కు రూ.20,000 అనుకోండి,” అని ఆమె చెప్పారు. ఫోక్ కొరియోగ్రఫీకి, ఇతర సాధారణ సాంగ్స్ కొరియోగ్రఫీకి మధ్య ఉన్న తేడాలను ఆమె వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న దండుపాళ్యం బ్యూటీ.. ఆమె ఇన్ స్టా చూస్తే..
ఫోక్ సాంగ్స్ చేసేవారికి చాలా ప్రతిభ ఉంటుందని, అయితే వారి ప్రతిభ కేవలం ఫోక్ వరకే పరిమితం కావడం దురదృష్టకరమని అన్నారు. “వారు ఒకవేళ ఇటు వస్తే మాత్రం చాలా బాగుంటుంది,” అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తన పాటల్లో కొన్నింటికి తానే కొరియోగ్రఫీ చేసుకుంటానని, అయితే ప్రేక్షకులకు అదంతా ఒకేలా కనిపిస్తుందని తెలిపారు. అందరూ గొప్ప టాలెంట్ ఉన్నవారని, అయితే వారిని పరిశ్రమలోకి పూర్తిగా తీసుకురావడానికి తనకు పరిశ్రమ గురించి అంతగా తెలియదని పేర్కొన్నారు. అయితే, ఎవరైనా అవకాశాలు అడిగితే, “వీరున్నారు మాస్టర్, తీసుకోండి,” అని చెప్పి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Serial Song : పేరుకే సీరియల్ సాంగ్.. కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన పాట ఇది.. ఇప్పటికీ యూట్యూబ్‌లో తగ్గని డిమాండ్..
పరిశ్రమలో కొనసాగడం ఎప్పుడూ సులభం కాదని ఆమె అనుభవం చెబుతుంది. కొన్నిసార్లు “అనవసరంగా ఈ ఫీల్డ్‌లోకి వచ్చానే,” అని అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. “ఏందిరా ఈ బాధ నాకు, అసలు నేను ఎందుకు డాన్సర్ ని అయ్యాను?” అని కొన్నిసార్లు అనిపించిందని ఆమె పంచుకున్నారు. “అదే సేమ్ డాన్స్, సేమ్ ఎక్స్‌ప్రెషన్స్. ఏంట్రా బాబు యూట్యూబ్‌లో ఈమె ఒక్కతే ఉందా? తీసేయండిరా,” వంటి కామెంట్స్ ఆమెను నిరాశపరిచాయి. ఢీ వంటి ప్రముఖ డ్యాన్స్ షోలో పాల్గొన్నప్పుడు కూడా ఇదే తరహా విమర్శలను ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. “ఇదే ఫోక్ డ్యాన్సా? ఇంకేం రాదా నీకు?” వంటి వ్యాఖ్యలు వచ్చినా, వాటిని తట్టుకుని మరింత మారినట్లు చెప్పారు. ఈ విమర్శలు తనను మరింత పట్టుదలగా పని చేసేలా చేశాయని ఆమె స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..
జాను లిరి..
Janu Lyri Movie
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‌కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..