Reading Time: 2 minutes
Ai Jobs Future Skills Digital Fluency Career Growth

Career Growth : కృత్రిమ మేధస్సు (AI) సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న నేటి యుగంలో, ఉద్యోగాల స్వరూపం , నియామక ప్రక్రియలు వేగంగా మారిపోతున్నాయి. నేటి యజమానులు కేవలం బట్టీ పట్టిన సమాచారం కోసమో, పరిమిత సాంకేతిక నైపుణ్యాల కోసమో అభ్యర్థులను ఎంపిక చేయడం లేదు. విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు , ఆస్తి నిర్వహణ సంస్థల వంటి రంగాలలో నియామకదారులు ఇప్పుడు సరికొత్త ఆలోచనా విధానం ఉన్నవారికే పెద్దపీట వేస్తున్నారు. ఏఐని ఉపయోగించుకుంటూ నిరంతరం నేర్చుకోగల, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారగల, అందరితో కలిసి పనిచేస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకోగల వ్యక్తులకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ సరికొత్త ఏఐ ప్రపంచంలో కేవలం ఒక డిగ్రీ లేదా సర్టిఫికేషన్ మాత్రమే ఉద్యోగ విజయాన్ని హామీ ఇవ్వలేవు.. నిరంతర అభ్యాసం, మానసిక నైపుణ్యాలు , విచక్షణే విజయకేతనం  ఎగురవేస్తాయి.

డిజిటల్ ఫ్లూయెన్సీ (డిజిటల్ ప్రావీణ్యం)

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) నివేదిక ప్రకారం, 2030 నాటికి ఉద్యోగుల కీలక నైపుణ్యాలలో సుమారు 39 శాతం మార్పు వస్తుందని యజమానులు అంచనా వేస్తున్నారు. ఈ మార్పులలో ఏఐ (AI) , బిగ్ డేటా వంటి నైపుణ్యాలు అత్యంత ప్రధానమైన పాత్రను పోషించబోతున్నాయి. ఏఐ విప్లవం కారణంగా భవిష్యత్తులో నైపుణ్యాల అవసరాలలో పెద్ద మార్పులు వస్తాయని, ఏఐ , డేటా సంబంధిత రంగాలపై పట్టున్న వారి ప్రాముఖ్యత విపరీతంగా పెరుగుతుందని కార్పొరేట్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి, ప్రస్తుత కాలంలో మంచి ఉద్యోగం (Career Growth) సాధించాలంటే డిజిటల్ ఫ్లూయెన్సీని కలిగి ఉండటం అత్యవసరం.

విమర్శనాత్మక ఆలోచన , సమర్థవంతమైన సంభాషణ

ప్యూ రీసెర్చ్ సెంటర్ 2024 లో జరిపిన ఒక జాతీయ అభిప్రాయ సర్వే , అధ్యయనం ప్రకారం, దాదాపు 85 శాతం మంది కార్మికులు రాతపూర్వకంగా , మాటల ద్వారా సమర్థవంతంగా సంభాషించే నైపుణ్యాలను (Communication Skills), అలాగే విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను (Critical Thinking) అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగులు , యజమానులు ఇద్దరూ కూడా అత్యవసరమైనవిగా భావిస్తున్న అగ్ర నైపుణ్యాల జాబితాలో ఇవి ముందు వరుసలో ఉన్నాయి. కేవలం సాంకేతిక పరిజ్ఞానం (Career Growth) ఉంటే సరిపోదని, సమస్యలను విశ్లేషించే చొరవ కూడా ఉండాలని ఈ అధ్యయనం చెబుతోంది.

నాయకత్వం , నిరంతర అభ్యాసం

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రచురించిన నైపుణ్యాల నివేదికల ప్రకారం, రాబోయే రోజుల్లో నాయకత్వ లక్షణాలు (Leadership), సామాజిక ప్రభావం, జిజ్ఞాస , జీవితాంతం నిరంతరం నేర్చుకునే అలవాటు (Continuous Learning) వంటి నైపుణ్యాలకు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. ఏఐ యుగంలో ఈ నైపుణ్యాలు ఉన్నవారికే అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది. ఎందుకంటే మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సమాచార అక్షరాస్యతను పెంచుకుంటూ, విశ్లేషణాత్మక ఆలోచనతో ముందడుగు వేయడాన్ని WEF అగ్రశ్రేణి కార్యాలయ నైపుణ్యాలుగా నొక్కి చెబుతోంది.

సరికొత్త మార్పులతో దూసుకుపోతున్న ఏఐ ప్రపంచంలో, ఒక ఉద్యోగి విజయం కేవలం పుస్తక జ్ఞానానికో , పాతకాలపు పద్ధతులకో పరిమితం కాదు. యజమానులు కేవలం సమాచారం తెలిసిన వారి కంటే, ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వాడుకుంటూ సరికొత్తగా ఆలోచించే వారి కోసమే అన్వేషిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ , ప్యూ రీసెర్చ్ సెంటర్ పరిశోధనలు వెల్లడించినట్లుగా.. డిజిటల్ ప్రావీణ్యంతో పాటు విమర్శనాత్మక ఆలోచన, చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్ క్వాలిటీస్ , నిరంతరం అప్‌డేట్ అయ్యే మనస్తత్వం ఉన్నవారే భవిష్యత్తులో అద్భుతమైన కెరీర్ విజయాలను అందుకుంటారు.