Reading Time: < 1 minute

సూర్యపేటలో భగ్గుమన్న పాతకక్షలు..బీఆర్ఎస్ నేతను 3 ముక్కలుగా నరికి గోణె సంచిలో వేసి.!

Caption of Image.

సూర్యపేట జిల్లాలో ఘోరం జరిగింది.మే 22న అర్థరాత్రి యార్కారంలో ఒక్కసారిగా పాతకక్షలు భగ్గుమన్నాయి. దుండగులు అత్యంత దారుణంగా నడిరోడ్డుపై ఒకరిని కత్తులు, కొడవళ్లతో మూడు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

హత్యకు గురైన వ్యక్తిని బీఆర్ఎస్ నేత మధుగా గుర్తించారు. నిందితులు మధును కిరాతకంగా నరికి చంపడమే కాకుండా… ఆ పాడుబడ్డ శవాన్ని ఒక గోణె సంచిలో చుట్టి ఊరవతల పడేశారు. ఉదయం ఈ దారుణాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, మృతి చెందిన మధుపై గతంలో రెండు హత్య కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. పాతకక్షల నేపథ్యంలోనే ఈ దారుణ హత్య జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సూర్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ హత్య ఉదంతంతో యార్కారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

©️ VIL Media Pvt Ltd.