Reading Time: 2 minutes

కాక్రోచ్ జనతా పార్టీ @ 20M : ఇన్ స్టాలో 2 కోట్ల మంది ఫాలోవర్స్

Caption of Image.

ఇదో వరల్డ్ రికార్డ్.. జస్ట్ ఆరు అంటే ఆరు రోజుల్లోనే 20 మిలియన్.. అక్షరాల 2 కోట్ల మంది ఫాలోవర్స్. కాక్రోచ్ జనతా పార్టీకి ఇన్ స్టాలో ఫాలోవర్స్ సంఖ్య ఇది. ప్రీ స్పీచ్ ట్యాగ్ చేస్తూ జెన్ జీ కుర్రోళ్లు రెచ్చిపోతున్నారు. ఇండియా ఎక్స్ లో బ్లాక్ చేసినా.. కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అంటూ మరో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత.. ఇన్ స్టాలో ఫాలోవర్స్ అమాంతం పెరగటం విశేషం. నియంతృత్వం ఎంత ఎక్కువగా ఉంటే.. అంత భారీగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇన్ స్టాలో 6 రోజుల్లోనే 2 కోట్ల మంది ఫాలోవర్స్ రావటం.. ఈ నెంబర్ అంతకంతకూ పెరుగుతుండటం విశేషం. ఈ నెంబర్ ఎక్కవ వరకు వెళుతుంది.. యూత్ కనెక్టివిటీ ఎంత ఉంటుంది.. ఎంత దూరం వెళుతుంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది.

‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దీప్కే అనే 30 ఏండ్ల యువకుడి ఆలోచన నుంచి ఈ నెల 16న పుట్టింది. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. ఎంతలా అంటే జస్ట్ ఆరు రోజుల్లోనే రెండు కోట్ల మంది ఆ సెటైరికల్ పార్టీని ఫాలో అవడం మొదలుపెట్టారు. 

గంటగంటకూ ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సీజేపీ దాటేసింది. దేశంలోని పరిస్థితులపై జెనీ తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తోంది. 

ఈ క్రమంలో సీజేపీ ఆధారంగా యువత.. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటోంది. ఇప్పుడది ప్రశ్నించే స్థాయి నుంచి.. ఓ ఆన్లైన్ ఉద్యమం దాకా పెరిగిపోయింది. ఈ పార్టీకి రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు చాలా మంది మద్దతుగా నిలబడ్డారు. ఆ పార్టీని ఫాలో అవుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.