Reading Time: < 1 minute

హుజూర్ నగర్ ఇరిగేషన్ శాఖలో అధికారుల మధ్య గొడవ.. తల్వార్తో దాడికి ప్రయత్నించిన డీఈఓ

Caption of Image.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఇరిగేషన్ శాఖలో పని చేస్తున్న ఇద్దరు అధికారుల మధ్య గొడవ చినికి చినికి గాలివానలా తయారైంది. ఏకంగా అసహనం కోల్పోయి దాడి చేసేందుకు తల్వార్ తీసుకొచ్చే వరకు వెళ్లింది. హుజూర్ నగర్ ఇరిగేషన్ ఆఫీసులో ఉద్రిక్తీ వాతావరణానికి కారణమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

ఇరిగేషన్ శాఖలో డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న వరుణ్.. కొత్త పాస్ ఫోర్ట్ కోసం పై అధికారుల పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పాస్ పోర్ట్ అప్లికేషన్ ను అదే శాఖలో ఏఈఈ గా పనిచేస్తున్న జీవన్ కుమార్ ఫార్వర్డ్ చేయడంలేదని వరుణ్ ఆరోపిస్తు్న్నాడు. అప్లికేషన్ ఫార్వార్డ్ చేయకుండా నిలిపివేస్తు్న్నాడనే అంశంలో ఇద్దరి నడుమ తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. 

ఈ వివాదంలో పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మాట మాట పెరిగి అసహనానికి లోనైన డిఏఓ వరుణ్.. బయటకు వెళ్లి తల్వార్ తీసుకొని వచ్చి ఏఈఈ జీవన్ కుమార్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు.  అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకుని ఇద్దరినీ దూరం తీసుకెళ్లారు. 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఘటన స్తలానికి చేరుకున్న పోలీసులు ఇరువురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

©️ VIL Media Pvt Ltd.