Reading Time: < 1 minute

వడా పావ్, పావ్ బాజీ ఇష్టంగా తింటారా.. రేట్లు పెరిగినయ్.. చూస్కోండి మరి !

Caption of Image.

దేశంలో ఇన్నాళ్లుగా చాపకింద నీరులా కనబడకుండా పెరుగుతూ వస్తున్న ఆర్థిక సంక్షోభం.. ఇప్పుడు ప్రతి వస్తువుపై ప్రభావం చూపుతోంది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అన్ని ఆహార పదార్థాలపై పడుతోంది. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్న సామాన్యులకు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంటున్న వడ పావ్, పావ్ భాజీ, మిసల్ పావ్ వంటి స్నాక్ ఐటమ్స్ ఇప్పుడు భగ్గున మండిపోయే పరిస్థితి వచ్చింది. ముంబై వీధుల్లో సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు ఇష్టమైన ఈ బేకరీ ఐటమ్స్ ఇప్పుడు మరింత కస్ట్లీగా మారిపోయాయి. సడెన్ గా ధరల పెంపు ముంబై ఫుడ్ లవర్స్ ను షాకింగ్ కు గురిచేస్తోంది. 

బై బేకరీలు పావ్ ధరలను అమాంతం పెంచేశాయి.  12 పావ్ లు ఉన్న పాకెట్ ధర 10 రూపాయలు పెంచారు. ఒక్క పావ్ ఇప్పటి వరకు 3 రూపాయలకు అమ్మేవారు. ఈ పెంపుతో 4 రూపాయలకు చేరుకుంది. సబెన్ గా పావ్ ధర పెంచడంతో చీప్ గా దొరికే ముంబై ఫేమస్ ఐటమ్స్ పావ్ భాజీ, వడపావ్, మిసాల్ పావ్ వంటివి రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి 

ముంబైలో పావ్ అందరికీ ఇష్టమైన ఆహార పదార్థం. తక్కువ ధరకు అందుబాటులో ఉండటం.. దానితో చేసి వెరైటీల కారణంగా ముంబై స్ట్రీట్ ఫుడ్ అంటే పావ్ ఐటమ్స్ అనే బ్రాండ్ ఉంది. అయితే ముడిపదార్థాల ధరలు, ప్యాకేజింగ్, ట్రాన్స్ పోర్ట్ కాస్ట్ పెరగటంతో పావ్ ధరలు పెంచినట్లు బేకరీ ఓనర్లు చెబుతున్నారు. దీంతో వీధి వ్యాపారులు కూడా పెంచక తప్పని పరిస్థితి అని అంటున్నారు. పావ్ ధరల పెరుగుదల మిడిల్ క్లాస్, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు చెబుతున్నారు. 

ALSO READ : మీ రిక్వెస్ట్ ను నార్వే అంగీకరించిందా మోదీజీ.

పావ్ ధరల పెరుగుదల.. ముంబైలో ఆహారం, చమురు ద్రవ్యోల్బణం కారణంగా ఏర్పడినట్లు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. బ్రెడ్ ధరలు ఇది వరకే పెరిగాయి. పెట్రోల్, డీజిల్, ధరలు పెరగుదలతో.. రవాణా ఖర్చులు పెరిగిపోయి.. ఆ తర్వాత ఒక్కో దానిపై ప్రభావం చూపుతూ వస్తున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.