Reading Time: < 1 minute

Summer Health : తాటి ముంజల్లో ఉండే పోషకాలు సర్వరోగ నివారిణి.. విటమిన్ల నుంచి క్యాన్సర్ వరకు ఎలా పనిచేస్తాయంటే

Caption of Image.

తాటి ముంజలు. ఎండాకాలంలో దొరికే సీజనల్ ఔషదం. తాటి ముంజలే కదా అని లైట్ తీసుకోవద్దు. వేసవి కాలంలో.. భగభగ మండే ఎండల్లో ఈ తాటి ముంజలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. తాటి ముంజల్లో ఉండే విటమిన్లు, పోషకాలు సర్వరోగ నివారిణిగా పని కొస్తాయంటే ఆశ్చర్యం లేదు. తాటి ముంజలు తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం…

తాటి ముంజల్లో ఉండే విటమిన్లు : 

విటమిన్- A, విటమిన్ B, ఏటమిన్ C, ఐరన్, క్యాల్షియం, B కాంప్లెక్స్, నియాసిన్, రిబోఫ్లెవిన్, థయామిన్, జింక్, పాస్పరస్, పొటాసియం. ఒక్క తాటి ముంజలో ఇన్ని విటమిన్లు, పోషకాలు ఉంటాయి. 

తాటి ముంజ సర్వరోగ నివారిణి : 

తాటి ముంజలు తినటం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. అలసట లేకుండా చేస్తుంది.

చర్మ సమస్యల్ని తగ్గిస్తుంది. చర్మ రోగాలను నుంచి రక్షణ ఇస్తుంది. 

బాడీని డీటాక్సిఫై చేస్తుంది. శరీరంలో ఉంటే యాంటీఆక్సిడెంట్లను బయటకు పంపిస్తుంది. 

తాటి ముంజలు తదినటం వల్ల శరీరంలో కొవ్వు ఇట్టే కరుగుతుంది. కొవ్వు కరగటం వల్ల బరువు ఇట్టే తగ్గుతారు. 

బయట మండే ఎండలు ఉన్నా మన శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది. 

మల బద్దకం అదేనండీ.. డైజేషన్ ప్రాబ్లమ్స్ కు తాటి ముంజలు చక్కటి పరిష్కారం చూపిస్తాయి. దద్దుర్లు, కాలిన మచ్చలు, చెమటకాయలను తగ్గిస్తుంది.

ఇక తాటి ముంజల్లో ఉంటే పోషకాలు బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

ఈ కాలంలో క్యాన్సర్ అనేది లక్షల మందిని భయపెడుతుంది. ఎండాకాలంలో తాటి ముంజలు తినటం వల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది. 

©️ VIL Media Pvt Ltd.