Reading Time: < 1 minute

మిల్లర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ చేస్తాం : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు

Caption of Image.

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ధాన్యం దిగుమతి చేసుకోవడంలో రైస్ మిల్లర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు. మంగళవారం జిల్లాలోని గణపురం మండలం బుర్రకాయల గూడెంలోని జానకి రామ, చిట్యాల మండలం కైలాపూర్ లక్ష్మీనరసింహ రైస్ మిల్లులను ఆయన కలెక్టర్​రాహుల్​శర్మతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాలు పేరుతో తరుగు తీస్తామంటే సహించేది లేదన్నారు. ధాన్యం దిగుమతుల్లో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. అనంతరం కలెక్టరేట్ లో బ్యాంక్ రుణాల వార్షిక ప్రణాళికను రూపొందించారు. రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.