Reading Time: < 1 minute

SRH vs CSK మధ్య హైటెన్షన్ పోరు.. నేటి మ్యాచ్కి వర్షం ముప్పు

Caption of Image.

SRH vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా ఈరోజు (2026, మే 18న) సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హైటెన్షన్ పోరు జరగనుంది. ప్లే ఆఫ్ రేసులో అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అలాగే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచులో ఆడే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో SRH vs CSK మ్యాచ్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ చివరి నిమిషంలో వాతావరణ శాఖ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. 

ఇవాళ చెన్నై వర్సెస్ ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్ కి వర్షం ముప్పు ఉందని, రాత్రి చెపాక్ ప్రాంతంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెన్నై వాతావరణ కేంద్రం అంచనా వేసింది. టాస్ పడే సమయానికి (సాయంత్రం 6:30 PM) 36 శాతం వాన పడే అవకాశం ఉండగా, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి (రాత్రి 7:30 PM) అది 25 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేశారు. 

►ALSO READ | BCCI ఆర్టీఐ పరిధిలోకి రాదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు

రాత్రి 8:30 గంటల తర్వాత వర్షం మొత్తం తగ్గపోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఒకవేళ సాయంత్రం వాన కురిస్తే ఆట ప్రారంభం కావడంలో కొంత జాప్యం అయ్యే ప్రమాదం ఉంది. కానీ చెపాక్ స్టేడియంలో ఉన్న అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ కారణంగా.. మ్యాచ్ పూర్తిగా రద్దు కావడం గానీ, లేదా ఓవర్లను భారీగా తగ్గించడం గానీ జరగకపోవచ్చని సమాచారం. అభిమానులకు పూర్తి 40 ఓవర్ల వినోదం దక్కడం ఖాయమని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక వేళ ఊహించని స్థాయిలో వర్షం కంటిన్యూగా కురిస్తే మ్యాచ్ రద్దైతే మాత్రం ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. దీంతో సన్ రైజర్స్ జట్టు ప్లే ఆఫ్స్ కి అర్హత సాదించే ఛాన్స్ ఉందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.  

©️ VIL Media Pvt Ltd.