
కమెడియన్ సత్య హీరోగా, వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటించిన మూవీ ‘జెట్లీ’(JetLee). ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. క్రేజీ డైరెక్టర్ రితేష్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం మే 25 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓటీటీ సంస్థ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.
‘‘ఎముకలు విరిచే యాక్షన్, కడుపుబ్బా నవ్వించే వినోదంతో కూడిన సరికొత్త విమాన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. ఉత్కంఠ, హాస్యం, ఊహించని మలుపులతో సాగే ఈ క్రేజీ రైడ్ కోసం సీటు బెల్టులు బిగించుకోండి! జెట్లీ మే 25 నుంచి జియోహాట్‌స్టార్‌లో ల్యాండింగ్ అవుతోంది’’ అని సదరు ఓటీటీ సంస్థ క్రేజీ క్యాప్షన్తో ఆసక్తి పెంచింది.
Get ready for first-of-its-kind inflight entertainment with bone-breaking action 💥
Fasten your seatbelts for a mad, turbulent ride ✈️ #JetLee is crash landing on 25th May on JioHotstar! 💫 #JetLeeOnJioHotstar
A @RiteshRana‘s turbulence 🛫
Starring #Satya, #RheaSingha,… pic.twitter.com/mPAZ8dgFUq
— JioHotstar Telugu (@JioHotstarTel_) May 17, 2026
విమానం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కామెడీ థ్రిల్లర్‌లో సత్య ‘డాక్టర్ వేదవ్యాస్’ పాత్రలో కనిపించాడు. థియేటర్లలో మిక్సెడ్ టాక్ అందుకున్న ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సత్య తన కామెడీ టైమింగ్‌తో, మ్యానరిజమ్స్‌తో సినిమాను భుజాన వేసుకుని నడిపించాడు. ముఖ్యంగా గతం మర్చిపోయిన వ్యక్తిగా ఆయన చేసే కన్ఫ్యూజన్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్ అమాయకమైన నటనతో ఆకట్టుకున్నాడు.
కథేంటంటే:
వ్యాపారవేత్త ప్రజాపతి (అజయ్) రూ.15 వేల కోట్ల భారీ బ్యాంకింగ్ స్కామ్ చేసి దుబాయ్‌కు పరారవుతాడు. అతడిని పట్టుకుని ఇండియాకు తీసుకురావడానికి ఇంటెలిజెన్స్ ఏజెంట్ శివాని రాయ్ (రియా సింఘా) బృందం రంగంలోకి దిగుతుంది. ప్రజాపతిని ఒక ప్రైవేట్ విమానంలో కొచ్చికి తరలిస్తుండగా, అదే ఫ్లైట్‌లో డాక్టర్ వేదవ్యాస్ (సత్య) కూడా ఉంటాడు.
అయితే, అనుకోకుండా ఈ విమాన ప్రయాణంలో వేదవ్యాస్ తన గతాన్ని మర్చిపోతాడు. మరోవైపు, ప్రజాపతిని చంపడానికి శత్రువుల నుండి ముప్పు పొంచి ఉంటుంది. అసలు ఈ గందరగోళం మధ్య వేదవ్యాస్ ఎవరు? అతనికి ‘జెట్లీ’ అనే పేరు ఎలా వచ్చింది? విమానం హైజాక్ నుండి ప్రయాణికులను అతను ఎలా కాపాడాడు? అన్నదే మిగతా కథ.