
వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదించడం.. జనాల ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు.. నాకు డబ్బులు వస్తున్నాయా లేదా.. అన్నట్లు తయారైంది చాలా మంది వ్యాపారుల ధోరణి. ఆ మధ్య ఒకడు మోరీలలో పారే మురుగు నీటిలో కూరగాయరలు, పండ్లు కడిగి దేశం మొత్తాన్ని షాకింగ్ కు గురిచేశాడు. వీళ్లు అలాంటోళ్లే.. కూరగాయలను ఏకంగా టాయిలెట్ లో స్టోర్ చేస్తూ జనాలు బేవ్ మని వాంతి చేసుకునే దుర్మార్గానికి ఒడిగట్టారు.
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది ఈ ఘటన. కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు కలిసి వెజిటేబుల్స్ ను టాయిలెట్స్ లో స్టోర్ చేస్తూ దొరికిపోయారు. సిటీలోని మవాన నవీన్ సబ్జీ మండిలో లో ఈ ఘోరమైన పనికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టమాట, బెండకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనంకాయ మొదలైన కూరగాయలను పాలిథీన్ కవర్లలో పెట్టి.. మార్కెట్ దగ్గర ఉన్న మరుగుదొడ్లలో నిలవ ఉంచారు. అయితే చాలా రోజులుగా జామ్ అవ్వటంతో.. టాయిలెట్లు వినియోగంలో లేవని మండి కమిటీ సెక్రటరీ అర్జున్ సింగ్ తెలిపారు.
ప్రధాన్ ట్రేడింగ్ కంపెనీకి ప్రొప్రెయిటర్ అయిన అభయ్ కుమార్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అధికారుల పర్మిషన్ లేకుండా.. నేరుగా టాయిలెట్స్ లో స్టో ర్ చేస్తున్నాడు. ఈ విషయం గురించి ఫిర్యాదు అందటంతో మే 15వ తేదీన వెళ్లి ఒక కింటాల్ కూరగాయలను స్వాధీనం చేసుకుని.. ఎవరూ ఉపయోగించకుండా పూడ్చిపెట్టినట్లు తెలిపారు.
ఈ వ్యవహారంపై అభయ్ కుమార్ కు నోటీస్ పంపినట్లు చెప్పారు. అయితే వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో లైసెన్స్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. మార్కెట్లో ఉన్న టాయిలెట్ రైతులు, కమిషన్ ఏజెంట్లు, కస్టమర్లు వినియోగించేందుకు ఏర్పాటు చేశారు. అయితే అవి డ్యామేజ్ అవ్వటంతో పట్టించుకునేనా నాధుడే లేక అలా పడిఉన్నాయి. టాయెలెట్స్ జామ్ అవ్వటంతో అప్పటికే దారుణంగా దుర్గంధం వస్తున్న చోట కూరగాయలు దాచడంపై తీవ్ర దుమారం రేపింది.
🚨 SHOCKING : Toilet Turned into Vegetable Market #Mawana, Meerut : A public toilet built for the people has been turned into a vegetable market inside.
Vegetables are being kept right next to the toilet seats.Think about it: the “fresh and green” vegetables you are eating… pic.twitter.com/fk3TgKIqXi
— Amitabh Chaudhary (@MithilaWaaala) May 17, 2026