Reading Time: < 1 minute

ఆర్ట్స్ కాలేజీలో ఊపిరి వంతెన ఆవిష్కరణ

Caption of Image.

హైదరాబాద్​ సిటీ, వెలుగు: పెండ్యాల ఆంజనేయులు రచించిన ‘ఊపిరి వంతెన’ కవితా సంపుటిని ఆర్ట్స్ కాలేజీలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కవిత్వం సమాజానికి స్ఫూర్తినిస్తూ, ముందు తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. వర్సిటీలో చిన్న ఉద్యోగిగా పనిచేస్తూనే సామాజిక స్పృహ కలిగించేలా ఆంజనేయులు కవితలు రాయడం అభినందనీయమన్నారు. తనకు సహకరించిన వారికి రచయిత ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. స్వాతి, ఓయూ తెలుగు శాఖ అధ్యక్షురాలు ప్రొఫెసర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.