Reading Time: < 1 minute

ఎంపీ అరవింద్ Vs ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. సోషల్ మీడియాలో మాటల యుద్ధం

Caption of Image.

బీజేపీ ఎంపీ అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య  మాటల యుద్దం సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రవిమర్శలు చేసుకున్నారు.  జగిత్యాల మంజూరైన కేంద్రీయ విశ్వ విద్యాలయాన్ని ఎమ్మెల్యే  సంజయ్ కుమార్ నిర్లక్ష్యం చేస్తున్నాడని ఎంపి ధర్మపురి అరవింద్ అరోపించారు. నిరసనగా రేపు సోమవారం మే 18,2026న ధర్మదీక్షకు పిలుపునిచ్చారు. ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై నిన్న (శనివారం) ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. 

అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే  సంజయ్ కుమార్ తీవ్రవిమర్శలు చేశారు. అరవింద్ ఆరోపణలకు స్పందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్..కేంద్రీయ విద్యాలయానికి రెండు ఎకరాలు కేటాయిస్తామని ప్రకటించారు. కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాలు అడిగితే సోషల్ మీడియా వేదికగా  రెండెకరాలు ఇవ్వడమేమిటి అని నిలదీస్తూ మరో వీడియో విడుదల చేశారు ధర్మపురి అరవింద్.ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ పరస్పరం  సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేయడంతో కేంద్రీయ విశ్వ విద్యాలయం అంశం బాగా  వైరల్ అవుతోంది. 

©️ VIL Media Pvt Ltd.