Reading Time: < 1 minute

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం..

Caption of Image.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని యూనిట్-3 లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలు వ్యాపించడాన్ని గమనించిన అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ప్లాంట్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన స్పందించి, మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలను విజయవంతంగా అదుపు చేశారు.

అయితే ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగసిపడటంతో కంట్రోల్ కేబుల్స్, కొన్ని వాల్వ్ లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో మంటలను ఆర్పేయడంతో ప్లాంట్‌కు జరగాల్సిన ఒక భారీ నష్టం తప్పిందని చెప్పాలి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.