Reading Time: < 1 minute

సాలూరా మండలంలోని షార్ట్ సర్క్యూట్ తో మొక్కజొన్న బస్తాలు దగ్ధం

Caption of Image.

బోధన్, వెలుగు: నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని జాడిజమాల్ పూర్ కు చెందిన రైతు ఆలూరి రామకృష్ణకు చెందిన 280 మొక్కజొన్న సంచులు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమయ్యాయి. వ్యవసాయ పొలం మీదుగా వెళ్లే కరెంట్ వైర్లు ఒకదానికి ఒకటి తగిలి అక్కడ సంచుల మీద నిప్పు రవ్వలు పడడంతో మంటలంటుకొని కాలిపోయాయి.

రైతులు ఫైర్ స్టేషన్​కు ఫోన్ చేయడంతో సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. మక్కజొన్నలు కాలిపోయి రూ.2 లక్షల మేర నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 

©️ VIL Media Pvt Ltd.