
KKR vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT)తో జరుగుతున్న కీలక పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్లు ఊచకోత కోశారు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. ఓపెనర్ ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ, కెమెరాన్ గ్రీన్ సిక్సర్ల తుఫాన్‌తో గుజరాత్ బౌలర్లపై దండయాత్ర చేశారు.
ఫిన్ అలెన్ మాస్ రాంపేజ్:
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌కు ఆశించిన స్టార్ట్ లభించలేదు.. కెప్టెన్ అజింక్యా రహానే (14) తక్కువ పరుగులకే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో గుజరాత్‌కు ఫస్ట్ బ్రేక్ త్రూ దొరికింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యంగ్ సెన్సేషన్ అంగ్క్రిష్ రఘువంశీతో కలిసి ఓపెనర్ ఫిన్ అలెన్ టైటాన్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 95 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఫిన్ అలెన్ కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, ఏకంగా 10 సిక్సర్లతో 93 రన్స్ చేసి సెంచరీకి చేరువయ్యాడు. కానీ, సాయి కిషోర్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సెంచరీ మిస్ అయినప్పటికీ అలెన్ ఆడిన మాస్ ఇన్నింగ్స్‌కు ఈడెన్ గార్డెన్స్ మొత్తం షేక్ అయిపోయింది.
రఘువంశీ, గ్రీన్ ఎదురుదాడి:
ఫిన్ అలెన్ అవుటైనా కేకేఆర్ రన్ రేట్ అస్సలు తగ్గలేదు.. అంగ్క్రిష్ రఘువంశీ, కెమెరాన్ గ్రీన్ కలిసి గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా ఎదురుదాడికి దిగారు. క్లాస్ షాట్లతో అలరించిన రఘువంశీ ఈ సీజన్‌లో మరో హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. మరో ఎండ్‌లో కెమెరాన్ గ్రీన్ సైతం తన పవర్ హిట్టింగ్‌తో స్టేడియం నలుమూలలా సిక్సర్లు బాదుతూ చెలరేగిపోయాడు. గ్రీన్ కూడా తనదైన శైలిలో వేగవంతమైన అర్ధ శతకాన్ని బాదేశాడు.
22 సిక్సులు బాదిన కేకేఆర్:
మొత్తంగా కేకేఆర్ ఇన్నింగ్స్‌లో 22 సిక్సర్లు నమోదు అయ్యాయి. గుజరాత్ టైటాన్స్ వంటి బలమైన బౌలింగ్ లైన్ అప్‌ను ఈ స్థాయిలో ఉతికేయడం విశేషం.. 248 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్న శుభ్‌మన్ గిల్ సేన ఈ రికార్డు రన్ చేజ్‌ను ఎలా అధిగమిస్తుందో అనేది చూడాలి.
Now THAT is what you call finishing with authority! 💥
Updates ▶️ https://t.co/m8jevRTt29#TATAIPL | #KhelBindaas | #KKRvGT | @KKRiders pic.twitter.com/p7YHWd7O7R
— IndianPremierLeague (@IPL) May 16, 2026
See ball. Hit ball. Destroy the attack 🔥
🎥 Finn Allen sent everything into the stands tonight 👊
Updates ▶️ https://t.co/m8jevRTt29#TATAIPL | #KhelBindaas | #KKRvGT | @KKRiders pic.twitter.com/0tdIr06Wux
— IndianPremierLeague (@IPL) May 16, 2026