Reading Time: < 1 minute

జడ్చర్లలో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది..నిందితుడికి స్థానికుల దేహశుద్ధి, పరిస్థితి విషమం

Caption of Image.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో  ప్రేమ పేరుతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదన్న  కారణంతో ఓ యువతిని అతికిరాతకంగా  గొంతు కోసి చంపాడు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

యువతిపై దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన ఆమె బంధువులు, స్థానికులు.. పారిపోతున్న నిందితుడిని పట్టుకున్నారు. కళ్లెదుటే యువతి ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన బంధువులు.. నిందితుడిని బంధించి చితకబాదారు.

తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న ఆ యువకుడిని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షించారు. ప్రస్తుతం నిందితుడిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.