July 11, 2026

Dragon – Peddi : ఎన్టీఆర్ – రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే

Dragon – Peddi : ఎన్టీఆర్ – రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే
Reading Time: < 1 minute
Ram Bheem Power Again Jr Ntrs Dragon Glimpse To Be Attached With Peddi Movie

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌ ను ఒకే ఫ్రేమ్ లో చూసి మురిసిపోయిన అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా విడుదలతో పాటు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్ గ్లింప్స్‌ను థియేటర్లలో ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ రెండు భారీ చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే.

జూన్ 4న విడుదల కానున్న ‘పెద్ది’ సినిమాతో పాటు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ నెల 20న రానున్న ‘డ్రాగన్’ గ్లింప్స్‌ను జతచేస్తే రామ్ చరణ్ సినిమా చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ గ్లింప్స్ రావడం అనేది థియేటర్లలో ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్ అని చెప్పవచ్చు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘డ్రాగన్’గా ఎలా ఉండబోతున్నారో తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రవి బస్రూర్ దీనికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ గ్లింప్స్‌ను ‘పెద్ది’ మూవీతో థియేటర్లలో స్క్రీనింగ్ చేయడం వల్ల రెండు సినిమాలకూ భారీ మైలేజ్ లభిస్తుందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ ఒక ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే రికార్డు బుకింగ్స్ నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు ‘డ్రాగన్’ గ్లింప్స్ అప్‌డేట్‌తో మరింత హైప్‌ను మూటగట్టుకుంది. మొత్తానికి జూన్ మొదటి వారంలో థియేటర్ల వద్ద రామ్ మరియు భీమ్ ల పవర్ మరోసారి కనిపించబోతోంది.