
స్టార్ హీరోయిన్ సమంత తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా స్పీడ్ పెంచింది. నిర్మాత రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్న తర్వాత ఆమె నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). సమంతకు ‘ఓ బేబీ’ వంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో, అనౌన్స్‌మెంట్ నుండే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, లేటెస్ట్ గా ఈ సినిమా విడుదల విషయంలో ఒక ముఖ్యమైన మార్పు చోటుచేసుకుంది.
రిలీజ్ డేట్ మార్పు..
నిజానికి ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ప్రస్తుతం ఐపీఎల్ (IPL 2026) ఫీవర్ పీక్స్‌లో ఉండటం, మే నెలాఖరులో కీలకమైన ప్లే-ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు ఉండటంతో ప్రేక్షకుల దృష్టి అటు మళ్లే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావించిన మేకర్స్, సినిమాను జూన్ 19వ తేదీకి వాయిదా వేశారు. రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ (Peddi) జూన్ 4న విడుదలవుతుండగా, దానికి రెండు వారాల గ్యాప్ ఇచ్చి సమంత థియేటర్లలోకి అడుగుపెట్టబోతోంది.
Tralala Moving Pictures has announced that its upcoming production #MaaIntiBangaaram, starring Samantha, will now release worldwide on June 19th, 2026, moving from its previously announced date of May 15.
The decision was made to avoid a clash with the IPL season.
— BA Raju’s Team (@baraju_SuperHit) May 6, 2026
యాక్షన్ మోడ్‌లో సమంత..
ఈ సినిమా సమంత కెరీర్‌లో చాలా ప్రత్యేకం. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై సమంత స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ఆమె 1980ల కాలం నాటి ఒక సాధారణ ఇల్లాలు పాత్రలో కనిపిస్తుంది. పైకి ఎంతో సాత్వికంగా కనిపించే ఆ ఇల్లాలు వెనుక ఒక భయంకరమైన గతం, ఒక రహస్య మిషన్ ఉంటుందని టీజర్ హింట్ ఇచ్చింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తోంది.
►ALSO READ | Vijay: వెండితెరపై ‘సీఎం’ టైటిల్ కార్డ్.. భారత సినీ చరిత్రలో విజయ్ సరికొత్త రికార్డ్!
ఈ మూవీలో సమంత, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తడిమల్ల, శ్రీముఖి, శ్రీలక్ష్మి, అంజలి, సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ తన వైవిధ్యమైన మ్యూజిక్‌తో ఈ సినిమాకు హైప్ పెంచుతున్నారు. ఈ చిత్రాన్ని సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వురు కలిసి నిర్మిస్తున్నారు. కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గానే కాకుండా, ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. మరి జూన్ నెలలో సమంత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి..