July 14, 2026

Dulquer Salman : కూతురికి దుల్కర్ సల్మాన్ బర్త్ డే గిఫ్ట్.. ఐదు లక్షల బైక్ పై పారిస్ రైడ్

Dulquer Salman : కూతురికి దుల్కర్ సల్మాన్ బర్త్ డే గిఫ్ట్.. ఐదు లక్షల బైక్ పై పారిస్ రైడ్
Reading Time: < 1 minute
Dulquer Salmaans Paris Outing Special Bike Ride For Daughter Maryams Birthday

‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన మలయాళం హీరో ‘దుల్కర్ సల్మాన్’ ప్రస్తుతం తన కూతురు ‘మరియం అమీరా సల్మాన్’ తో కలిసి పారిస్ లో ఔటింగ్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా షూటింగ్స్ తో బిజీగా ఉన్న దుల్కర్ తన కూతురు బర్త్డే కావడంతో అన్ని పనులు పక్కన పెట్టే ఆమెతో కలిసి ఏకంగా పారిస్ వీధుల్లో స్పోర్ట్స్ బైక్ మీద చక్కర్లు కొట్టాడు.

సుమారు 5 లక్షల ఖరీదైన ఆ బైక్ పై ఈ తండ్రి కూతురులు ఇద్దరు మ్యాచింగ్ అవుట్ ఫీట్స్ తో దిగిన ఫోటులు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ ఏంటి దుల్కర్ కూతురు అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా ? అని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి 15 ఏళ్ళ క్రితం ‘అమల్ సుఫియా’ అనే ఆర్కిటెక్ట్ ను ఆరెంజ్ మ్యారేజ్ చేసుకున్న దుల్కర్ కు మే 5 2017 న ఈ క్యూట్ ‘మరియం’ పుట్టింది. మరియం కు వాళ్ళ నాన్న సినిమాలే కాకుండా హ్యారీ పోటర్ సిరీస్ అంటే బాగా ఇష్టం అంట. ఇక అటు ప్రొడక్షన్ ఇటు యాక్టింగ్ తో క్షణం తీరిక లేకుండా లైఫ్ లీడ్ చేస్తున్న దుల్కర్ కు తన కూతురు అంటే ఏంతో ఇష్టం. అందుకే వరుస షూటింగ్స్ ఉన్న కూడా అవన్నీ పక్కన పెట్టి తన కూతురి బర్త్ డే ను మెమరబుల్ గా మార్చాడు. దుల్కర్  సినిమాల విషయానికొస్తే ‘ఐ ఆమ్ గేమ్’ ఓనమ్ కానుకగా రిలీజ్ అవుతుండగా తెలుగులో చేస్తున్న ‘ఆకాశంలో ఒక తార’  షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.