Reading Time: < 1 minute

మే 25 నుంచి డీఈడీ ఫస్టియర్ ఎగ్జామ్స్

Caption of Image.

హైదరాబాద్,వెలుగు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఫస్టియర్ పరీక్షల టైమ్ టేబుల్‌‌ను అధికారులు రిలీజ్ చేశారు. 2025–-27 విద్యాసంవత్సరం బ్యాచ్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన అభ్యర్థులకు మే 25 నుంచి 31 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.  ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని తెలిపారు.  మే 25న చైల్డ్‌‌హుడ్ అండ్ లెర్నింగ్ పేపర్‌‌తో ప్రారంభమై.. 31న పెడగోగి అక్రాస్ కరిక్యులం పేపర్‌‌తో ముగుస్తాయని వెల్లడించారు.  

డీపీఎస్​ఈ ఎగ్జామ్స్ కూడా…

ఈనెల 25 నుంచి 30 వరకూ  డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్​ఈ) ఫస్టియర్ ఎగ్జామ్స్ ఉంటాయని పీవీ శ్రీహరి తెలిపారు. మే 25న ఎర్లీ చైల్డ్‌‌హుడ్ కేర్, 26న చైల్డ్ డెవలప్‌‌మెంట్ తో పాటు 27,28,30 తేదీల్లో పరీక్షలు ఉంటాయని చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.