Reading Time: < 1 minute

తాండూరు బిడ్డ.. గిన్నిస్ రికార్డు..ప్రపంచంలోనే ఎత్తైన రహదారిపై బైక్ రైడ్

Caption of Image.

తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన నిఖిత్ శెట్టి (22) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటార్ రహదారి అయిన ఉమ్లింగ్ లా పాస్​ను చేరుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. నిఖిత్ తాండూరులోని గౌతమ్ మోడల్ స్కూల్లో చదువుకుని, హైదరాబాద్​లో బీటెక్ పూర్తి చేస్తున్నాడు. చదువుతో పాటు యూట్యూబ్ చానల్ నడుపుతూ బైక్ రైడింగ్ చేసేవాడు. గత నెల ఏప్రిల్ 12న హైదరాబాద్​లోని తాడ్​బాన్ హనుమాన్ దేవాలయం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి, 28న 19,024 అడుగుల (5,798 మీటర్లు) ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లా పాస్​ను విజయవంతంగా చేరుకుని ఈ ఘనత సాధించాడు.

©️ VIL Media Pvt Ltd.