
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్… మరోసారి తెలుగు సినిమాలో నటించబోతోంది. బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది. బాలయ్య కెరీర్‌లో ఇది 112వ చిత్రం. ఇటీవలే ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్‌గా విద్యాబాలన్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది.
ఏడేళ్ల క్రితం ఎన్టీఆర్ బయోపిక్స్‌గా వచ్చిన ‘కథానాయకుడు’, మహానాయకుడు’ చిత్రాల్లో నటించిన విద్యా బాలన్… మరోసారి ఆయనకు జంటగా నటించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. అలాగే మరో కీలకపాత్రను సంజయ్ దత్ పోషించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్‌కు వెళ్లనుంది. బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.