July 15, 2026

ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల

ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల
Reading Time: < 1 minute

ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల

Caption of Image.

కీసర, వెలుగు: కీసర పరిధిలోని రాంపల్లి శ్రీనివాస్ కాలనీలో సోమవారం చోరీ జరిగింది. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి శుక్రవారం తన కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వెళ్లగా,  సోమవారం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా, బీరువాలో భద్రపరిచిన రూ.60 వేల నగదు మాయమైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు, చోరీ జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.