Reading Time: 2 minutes
SRH vs KKR Playing XI: టాస్ గెలిచిన హైదరాబాద్.. డబుల్ హ్యాట్రిక్‌కు సిద్ధం.. ప్లేయింగ్ 11 ఇదిగో..!

IPL సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ Playing XI: ఐపీఎల్‌లో ఈరోజు డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) జరగనున్నాయి. ఈ రోజు జరిగే మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మొదలైంది. ఈక్రమంలో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. గత మ్యాచ్‌లో హైదరాబాద్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఆరింటిలో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. వరుసగా తమ చివరి ఐదు మ్యాచ్‌లలో గెలిచి ఆ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. మరోవైపు, ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచిన కోల్‌కతా ఎనిమిదో స్థానంలో ఉంది.

కోల్‌కతాదే పైచేయి..

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 31 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో కోల్‌కతా నైట్ రైడర్స్ 19 మ్యాచ్‌లు గెలవగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 11 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఒక మ్యాచ్ టై కాగా, దానిని కోల్‌కతా సూపర్ ఓవర్‌లో గెలుచుకుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఏడు మ్యాచ్‌లు రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగాయి. ఆతిథ్య జట్టు హైదరాబాద్ మూడు మ్యాచ్‌లు గెలవగా, కోల్‌కతా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.

వాతావరణ పరిస్థితులు..

మే 3వ తేదీన హైదరాబాద్‌లో వర్షం పడే అవకాశం లేదు. ఆ రోజు చాలా ఎండగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు 27 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి.

పిచ్ నివేదిక..

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన 87 ఐపీఎల్ మ్యాచ్‌లలో, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 38 గెలవగా, ఛేజింగ్ చేసిన జట్లు 48 గెలిచాయి. ఇక్కడ అత్యధిక జట్టు స్కోరు 286/6, దీనిని గత సంవత్సరం రాజస్థాన్ రాయల్స్‌పై హైదరాబాద్ జట్టు నమోదు చేసింది.

రెండు జట్ల ప్లేయింగ్ 11..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(కీపర్), అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: అజింక్య రహానే(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ(కీపర్), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..