
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: రామప్ప టెంపుల్ ను బుధవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయ మండపంలో ఈవో ఇమ్మడి భాస్కర్ స్వామి శాలువాలతో సత్కరించారు. ఆలయ చరిత్ర శిల్పకలా వైభవాన్ని టూరిజం గైడ్ విజయ్ కుమార్ వివరించారు. అనంతరం రామప్ప లేక్ లో బోటింగ్ చేశారు.