
రణ్‌బీర్ ప్రస్తుతం నితీష్ తివారీ ‘రామాయణ’ (Ramayana), సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ (Love & War) షూటింగులతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ రెండు సినిమాలు 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ‘రామాయణ’ పార్ట్ 1 దీపావళి 2026న విడుదల కానుండగా, పార్ట్ 2 కోసం కూడా ఆయన డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది.
అయితే 2026 చివరిలో రణ్‌బీర్ ఫ్రీ అయిన తర్వాత ఆయన ముందు రెండు మెగా ఆప్షన్లు ఉన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ భారీ యాక్షన్ ఫ్రాంచైజీని రణ్‌బీర్‌తో రీబూట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇది పట్టాలెక్కితే కనీసం ఏడాదిన్నర సమయం తీసుకుంటుంది. అలాగే అయాన్ ముఖర్జీ ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ (Spirit) సినిమా పనుల్లో ఉన్నారు. అయితే ఆయన స్వయంగా వెల్లడించిన ప్రకారం, ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2027 ద్వితీయార్థంలో (Mid-2027) ప్రారంభం కావాల్సి ఉంది. రణ్‌బీర్ ఒకవేళ ‘ధూమ్ 4’ లేదా ‘బ్రహ్మాస్త్ర 2’ కి సైన్ చేస్తే, ఆ ప్రభావం ఖచ్చితంగా ‘యానిమల్ పార్క్’పై పడుతుంది. అప్పుడు సందీప్ రెడ్డి ప్లాన్ 2028కి వెళ్లే అవకాశం ఉంది.
కానీ బి-టౌన్ వర్గాల సమాచారం ప్రకారం, రణ్‌బీర్ కెరీర్‌కు ‘యానిమల్’ సక్సెస్‌ను మాములు బూస్ట్ ఇవ్వలేదు. కాబట్టి సందీప్ రెడ్డికి ‘హ్యాండ్’ ఇచ్చే ప్రసక్తే లేదని, అయితే ‘ధూమ్ 4’ వంటి క్రేజీ ప్రాజెక్ట్ వదులుకోవడం కూడా కష్టమేనని అంటున్నారు. అందుకే రణ్‌బీర్ తన డేట్స్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట. ‘యానిమల్ పార్క్’ ప్రారంభమయ్యే లోపే ఒక భారీ ప్రాజెక్ట్ ముగించాలని ఆయన చూస్తున్నారు.