
Minor Girl Cheating: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో కీలక నిందితుడు కోడూరు అర్జున్ అలియాస్ ఆజాద్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అర్జున్ పై పాక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అర్జున్ సోషల్ మీడియాలో సంపన్న కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
LSG కొంపముంచిన Aiden Markram ఓవర్.. IPL 2026లో అత్యంత ఖరీదైన ఓవర్ నమోదు.!
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయాలు పెంచుకుని పలువురు యువతులను వలలో వేసుకున్నాడు. జూబ్లీహిల్స్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురిని కూడా ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. మైనర్ బాలికను మాయమాటలు చెప్పి దాదాపు రూ.15 లక్షల వరకు దోచుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా నార్సింగిలో మరో యువతిని కూడా పెళ్లి పేరుతో పలుమార్లు కలుసుకుని బంగారం దోచుకున్నాడు. బాధితురాలితో నమ్మకం పెంచుకుని, తనకు స్టార్ట్‌అప్ కంపెనీ ప్రారంభించాల్సి ఉందని చెప్పి డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఇంట్లో ఉన్న నగదు తీసుకుని అర్జున్‌కు ఇచ్చినట్లు విచారణలో బయటపడింది.
ఈ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు బాలిక ఫోన్ మాట్లాడకుండా కుటుంబ సభ్యులు నియంత్రించినప్పటికీ, అర్జున్ కొత్త మార్గాలను వెతికాడు. ఇంట్లో ఉన్న ఆండ్రాయిడ్ టీవీ ద్వారా చాటింగ్ కొనసాగిస్తూ మళ్లీ డబ్బులు తీసుకున్నాడు. ఇదే సమయంలో ఇంటి పనివారిని కూడా వలలో వేసుకుని బాలికతో మాట్లాడి డబ్బులు తీసుకునేలా చేశాడు. ఇక్కడ ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే.. పనివారు బాలిక తల్లిదండ్రులకు విషయం చెబుతామని బెదిరించి రూ.9 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే చర్యలు తీసుకుని ఆ వ్యవహారాన్ని ఆపేశారు.
PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!
బాలిక నుంచి పొందిన డబ్బులతో అర్జున్ కారు కొనుగోలు చేసి, మరికొంతమంది యువతులను కూడా ఇదే విధంగా ట్రాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కేసుపై దర్యాప్తు కొనసాగుతుండగా, మరిన్ని బాధితులు ఉన్న అవకాశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.