
Kavya Maran Celebration SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోరులో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. ముఖ్యంగా రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వికెట్ పడగానే గ్యాలరీలో ఉన్న కావ్య మారన్ చిన్నపిల్లలా ఎగిరి గంతేసింది. సాధారణంగా జట్టు ఓడిపోతున్నప్పుడు నిరాశగా కనిపించే ఆమె, ఈ మ్యాచ్‌లో తన జట్టు బౌలర్లు చూపిస్తున్న ఆధిపత్యాన్ని చూసి ఎంతో ఉత్సాహంగా కనిపించింది.
సూర్యవంశీని బోల్తా కొట్టించిన ప్రఫుల్ హింగే..
ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ముంబై, బెంగళూరు బౌలర్లను చితకబాదిన ఈ బుడ్డోడు.. హైదరాబాద్ బౌలర్లను ఉతికి ఆరేసేందుకు ప్లాన్ చేశాడు. అయితే, సన్‌రైజర్స్ బౌలర్ ప్రఫుల్ హింజ్ సంధించిన పదునైన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన 15 ఏళ్ల ఈ కుర్రాడు పొరపాటు చేశాడు. బంతి బ్యాట్ పైభాగానికి తగిలి గాలిలోకి లేవడంతో వికెట్ కీపర్ సలీల్ అరోరా ఎలాంటి తడబాటు లేకుండా క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో సూర్యవంశీ ‘గోల్డెన్ డక్’ (మొదటి బంతికే అవుట్) గా వెనుదిరగాల్సి వచ్చింది.
వైరల్ అవుతున్న వీడియోలు..
A dream debut
Vaibhav Sooryavanshi
Dhruv Jurel
Lhuan – dre pretorious
Praful Hinge gets 3 wickets in his first over #TATAIPL#TATAIPL #IPLRivalryWeek 2026
#SRHvRR | LIVE NOW
https://t.co/kOHOKuG1Hi pic.twitter.com/8abJ2UAtyQ
— Star Sports (@StarSportsIndia) April 13, 2026
బంతి గాలిలోకి లేచిన క్షణం నుంచి అది కీపర్ చేతుల్లోకి చేరే వరకు కావ్య మారన్ ఎంతో ఆత్రుతగా గమనించింది. వికెట్ పడగానే ఆమె ముఖంలో కనిపించిన ఆనందం, ఆమె చేసిన సైగలు కెమెరాల్లో బంధించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ యువ బ్యాటర్ అవుట్ కావడం మ్యాచ్ గమనాన్ని మార్చేయడంతో, కావ్య ఆనందంతో చిందులు వేసింది. ఈ వీడియోలు చూసిన అభిమానులు ‘కావ్య పాప మళ్ళీ ఫామ్‌లోకి వచ్చింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సన్‌రైజర్స్ ఆధిపత్యం..
ప్రఫుల్ హింజ్ అద్భుతమైన బౌలింగ్, ఫీల్డర్ల సహకారంతో సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ కీలక వికెట్లు కోల్పోవడం హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చింది. తన జట్టు వరుసగా వికెట్లు తీస్తుంటే కావ్య మారన్ ఇచ్చే హావభావాలు ఎప్పుడూ క్రికెట్ ప్రేమికులను అలరించాయి. ఈ మ్యాచ్‌లో కూడా అదే పునరావృతమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Dhruv Jurel