Reading Time: 2 minutes

ఒప్పుకుంటున్నా.. మా బౌలర్లను బుడ్డోడు వణికించిండు: సూర్యవంశీపై ముంబై కోచ్ ప్రశంసలు

Caption of Image.

15 ఏళ్ల యంగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ముంబై ఇండియన్స్‎పై ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మంగళవారం (ఏప్రిల్ 7) గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచులో ముంబైపై కేవలం 14 బంతుల్లోనే 39 రన్స్ చేసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ప్రపంచ మేటి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‎లో ఒకే ఓవర్లో రెండు సిక్సులు కొట్టి అందరిని ఔరా అనిపించాడు ఈ ఏళ్ల చిచ్చర పిడుగు. ప్రత్యర్థి జట్టు హెడ్ కోచే స్వయంగా వైభవ్‎కు కితాబు ఇచ్చాడంటే అతడి బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. 

ముంబై, రాజస్థాన్ మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ ఎదుగుదల చూడటం చాలా ఉత్సాహంగా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాపై సూర్యవంశీ చూపిన పట్టుదల అందరి దృష్టిని ఆకర్షించిందని కొనియాడాడు. వైభవ్ తన డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్‎తో ముంబై బౌలర్లు ఇబ్బంది పెట్టాడని జయవర్ధనే ఒప్పుకున్నాడు. 

లాస్ట్ ఇయర్ ఐపీఎల్‎లోనే అతడి టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలిసిపోయిందన్నాడు. వైభవ్ దగ్గర మంచి స్కిల్ ఉందంటూ అతని ఆత్మవిశ్వాసాన్ని, అగ్రశ్రేణి బౌలింగ్‌ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రశంసించారు. యశస్వీ జైశ్వాల్ కూడా ముంబైపై అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని అన్నారు. మొదటి మూడు ఓవర్లలో అతను బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని.. చాలా చక్కటి షాట్లు ఆడాడని ప్రశంసించారు. 

ALSO READ : కోట్ల రూపాలు తీసుకునే ముందే తెల్వదా

ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ హవా కొనసాగుతోంది. మెగా టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్లోనూ రాయల్స్ విజయం అందుకుంది. మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన పోరులో యశస్వి జైస్వాల్ (32 బాల్స్లో 40 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆర్ఆర్ 27 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. ఆడిన మూడు మ్యాచ్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్కు చేరుకుంది. 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగు వచ్చిన రాజస్తాన్ 150/3 స్కోరు చేసింది.

వైభవ్ సూర్యవంశీ (14 బాల్స్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 39) కూడా దంచికొట్టాడు. అనంతరం ఛేజింగ్లో ముంబై 11 ఓవర్లలో 123/9 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. షెర్ఫానే రూథర్ఫర్డ్ (8 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25), నమన్ ధీర్ (13 బాల్స్లో 3 ఫోర్లు, 1 సిక్స్త్ 25) టాప్ స్కోరర్లు. రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, బర్గర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

©️ VIL Media Pvt Ltd.