
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్) హెచ్ఈఎంఎం ఆపరేటర్ (ట్రైనీ), పారా మెడికల్, ఓవర్‌సీర్ (సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 577.
విభాగాల వారీగా ఖాళీలు: డంపర్ ఆపరేటర్ (ట్రైనీ) 308, గ్రేడ్ ఆపరేటర్ (ట్రైనీ) 34, డోజర్ ఆపరేటర్ (ట్రైనీ) 52, క్రేన్ ఆపరేటర్ (ట్రైనీ) 17, పే లోడర్ ఆపరేటర్ (ట్రైనీ) 18, సర్ఫేస్ మైనర్ ఆపరేటర్ (ట్రైనీ) 43, స్టాఫ్ నర్స్ (ట్రైనీ), టీ &ఎస్ గ్రేడ్– సీ 47, ఫార్మాసిస్ట్ (ట్రైనీ), టీ &ఎస్ గ్రేడ్– సీ 4, టెక్నీషియన్ (పాథలాజికల్) (ట్రైనీ), టీ & ఎస్ గ్రేడ్– సీ 12, టెక్నీషియన్ (డెంటల్) (ట్రైనీ), టీ & ఎస్ గ్రేడ్– సీ 2, సైకోథెరపిస్ట్ (ట్రైనీ), టీ &ఎస్ గ్రేడ్– సీ 4, టెక్నీషియన్ (రిఫ్రెక్షన్/ ఆప్టోమెట్రి) (ట్రైనీ), టీ & ఎస్ గ్రేడ్– సీ 1, టెక్నీషియన్ (రేడియోగ్రాఫర్) (ట్రైనీ), టీ & ఎస్ గ్రేడ్ –సీ 3, జూనియర్ టెక్నీషియన్ (ఈసీజీ) (ట్రైనీ), టీ & ఎస్ గ్రేడ్ –సీ 2, ఓవర్ సీర్ (సివిల్) (ట్రైనీ), టీ & ఎస్ గ్రేడ్– సీ 30.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 9.
లాస్ట్ డేట్: మే 1.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ nclcil.inను సందర్శించండి.