Reading Time: < 1 minute

డైమండ్ డెకాయిట్‌‌‌‌.. మహిళలకు ఫస్ట్ డే అన్ని షోలు ఫ్రీ

Caption of Image.

పార్థ గోపాల్‌‌‌‌ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్‌‌‌‌’. మేఘన హీరోయిన్‌‌‌‌.  సూర్య జి యాదవ్ దర్శకుడు. ఏప్రిల్ 10న సినిమా విడుదల  కానుంది. తాజాగా  దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు  ట్రైలర్‌‌‌‌ను చూసి మూవీ టీమ్‌‌‌‌ను అభినందించారు.  

ఈ ప్రత్యేక సందర్భంలో మహిళా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన ఆఫర్‌‌‌‌ను ప్రకటించారు మేకర్స్.  తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ఈ సినిమా  ప్రదర్శించనున్నట్లు, మహిళలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వచ్చి ఈ చిత్రం చూడాలని హీరో, నిర్మాత పార్థ గోపాల్ అన్నాడు.  ఇదొక  కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని,  ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేలా  ఉంటుందని అందుకే ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించామని చెప్పాడు.  

©️ VIL Media Pvt Ltd.