Reading Time: < 1 minute

సింగరేణి పరిరక్షణకు ఐక్య పోరాటాలు : తుమ్మల రాజారెడ్డి

Caption of Image.

నస్పూర్, వెలుగు: సింగరేణి సంస్థ పరిరక్షణకు పోరాడతామని సీఐటీయూ జనరల్ సెక్రటరీ తుమ్మల రాజారెడ్డి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే5గనిపై జరిగిన సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్​తో కలిసి మాట్లాడారు.

గనుల్లో కార్మికులకు డ్రిల్ బిట్లు, నాణ్యమైన డ్రిల్ రాడ్లు, గ్లౌజులు, పనిముట్లు ఇవ్వడం లేదన్నారు. చివరకు పని స్థలాల్లో తాగునీటి వసతి కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచిన సంఘాల నాయకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమన్నారు. మెడికల్ లో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ దందాలో ఉన్న నాయకులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.