Reading Time: < 1 minute

వాహనదారులకు బిగ్ అలర్ట్: ఏప్రిల్ 10 నుంచి.. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు బంద్

Caption of Image.

టోల్​ ట్యాక్స్​కు  ఫాస్టాగ్ మాత్రమే

న్యూఢిల్లీ: హైవేలపై ఉండే టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను ఈనెల10 నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు జరపాలి.  ఫాస్టాగ్ లేని బండ్లు యూపీఐ ద్వారా చెల్లించాలనుకుంటే సాధారణ టోల్ చార్జీ కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గించి ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,150 కి పైగా టోల్ ప్లాజాలు ఉండగా.. ఫాస్టాగ్ వార్షిక పాస్ వినియోగదారుల సంఖ్య 50 లక్షలు దాటింది. నగదు రహిత లావాదేవీల వల్ల హైవేలపై ప్రయాణం మరింత సులభతరం అవుతుంది.

©️ VIL Media Pvt Ltd.