Reading Time: < 1 minute

గజ్వేల్ అర్బన్ పార్క్ లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు..

Caption of Image.

సిద్ధిపేట జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామం నుండి హబ్సిపూర్ వెళ్లే అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ( ఏప్రిల్ 7 ) జరిగిన ఈ ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందితో పాటు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు అడవిలో నిప్పులు చెలరేగయా లేక కావాలనే ఎవరైనా నిప్పంటించారానే విషయం తెలియాల్సి ఉంది. 

ప్రమాదం జరిగిన వెంటనే గమనించి స్థానికులు తెలపడంతో మంటలను త్వరగా అదుపులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు ఫైర్ సిబ్బంది. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.