
తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. తిరుమలలో కేంద్రీకృత టీటీడీ పరిపాలనా భవనాన్ని నిర్మించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఈ తనిఖీలు నిర్వహించారు వెంకయ్య చౌదరి. మంగళవారం ( ఏప్రిల్ 7 ) రామ్ భగీచా బస్టాండ్ కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు వెంకయ్య చౌదరి. అనంతరం ఆకాశగంగ దగ్గరికి చేరుకొని దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం శ్రీవారి సేవా సదన్ పక్కన ఉన్న లేబర్ షెడ్లను కూడా తనిఖీ చేశారు వెంకయ్య చౌదరి. అనంతరం తిరుమలలోని ఏటీసీ దగ్గరికి చేరుకున్న ఆయన రెవెన్యూ విభాగానికి కాటేజీ కేటాయింపుపై స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వేంకటేశ్వర్లు, వీజీవో శ్రీ సురేంద్ర, ఈఈలు శ్రీ శ్రీనివాసరావు, శ్రీ వేణు గోపాల్, డీఈ శ్రీ చంద్ర శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.