Reading Time: < 1 minute

హైదరాబాద్ ఐటీ కారిడార్ లో హైడ్రా భారీ ఆపరేషన్… రూ.12 వందల కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్ 

Caption of Image.

హైదరాబాద్ ఐటీ కారిడార్ లో భారీ ఆపరేషన్ నిర్వహించింది హైడ్రా. మంగళవారం ( ఏప్రిల్ 7 ) ఖానామెట్ లో రూ. 12 వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చెర నుంచి కాపాడింది హైడ్రా. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..ఐటీ కారిడార్ కు చేరువలోని ఖానామెట్ లో 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించింది హైడ్రా. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆక్రమణల కూల్చివేత చేపట్టారు.

హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూమి విలువ సుమారు రూ. 12 వందల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఖానామెట్ లోని సర్వే నంబర్ 55లో ఉన్న ప్రభుత్వ భూమిలో భారీ ఆపరేషన్ చేపట్టారు హైడ్రా అధికారులు. ఈ స్థలంలో తాత్కాలిక షెడ్లు, నిర్మాణాలు తొలగించారు హైడ్రా అధికారులు. హైడ్రా వార్నింగ్  తో ఆర్‌సీసీ ప్లాంట్‌ను స్వయంగా తొలగించింది ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నిర్మాణ సంస్థ.

ప్రభుత్వ భూమిలో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించిన హైడ్రా.. మొత్తం భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేసి..అసైన్డ్ ల్యాండ్‌గా గుర్తించి, ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు. రియల్ ఎస్టేట్ సంస్థల తప్పుడు క్లెయిమ్‌లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.

©️ VIL Media Pvt Ltd.