
దశాబ్దాలుగా దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకన్న నటి త్రిష (Trisha Krishnan). ప్రస్తుతం తన వృత్తిపరమైన విజయాల కంటే వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ విజయ్ (Thalapathy Vijay) తో ఆమె రిలేషన్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే లేటెస్ట్ గా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘రిటైర్మెంట్’ వార్త వైరల్
లేటెస్ట్ గా నటుడు చిత్రా లక్ష్మణన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్రిష ఇకపై సినిమాల్లో కొనసాగకూడదని నిర్ణయించుకున్నారని, కొత్త అవకాశాలను కూడా తిరస్కరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వార్త ఒక్కసారిగా నెట్టింట కార్చిచ్చులా వ్యాపించింది. ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారని కొందరు, పెళ్లి చేసుకోబోతున్నారని మరికొందరు రకరకాలుగా కథనాలు అల్లేశారు.
త్రిష అదిరిపోయే కౌంటర్!
తనపై వస్తున్న ఈ అసత్య ప్రచారాలను చూసి విసిగిపోయిన త్రిష, తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె స్పందిస్తూ.. “అవును.. నేను సినిమాలు మానేశాను. ఒక కోటీశ్వరుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నాను. మాకు నలుగురు పిల్లలు . వాళ్ళకి నిన్ననే రెండో ఏడు నిండింది కూడా! మీ ఊహల కోటా ఈ రోజుకి పూర్తయిందా? లేక ఇంకా ఏమైనా మసాలా జోడించమంటారా?” అంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు. ఈ ఒక్క పోస్ట్‌తో త్రిష తన రిటైర్మెంట్ వార్తలకు గట్టి చెక్ పెట్టడమే కాకుండా, తన వ్యక్తిగత జీవితంపై కట్టుకథలు అల్లేవారి నోళ్లు మూయించారు.
ALSO READ : అల్లు అర్జున్ బర్త్‌డే ట్రీట్.. తోడేలు పంజాతో అట్లీ మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్!
వరుస సినిమాలతో బిజీ బిజీ..
పుకార్లకు భిన్నంగా త్రిష కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. 40 ఏళ్ళు దాటినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ లో నటిస్తున్నారు. సూర్య సరసన ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘కరుప్పు (వీరభద్రుడు)’ లో కూడా నటించింది. ఈ చిత్రం మే 14న విడుదల కానుంది . మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి నటిస్తున్న ‘ రామ్’ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. వీటితో పాటు మరో రెండు మూడు చిత్రాల్లో కూడా నటిస్తుంది.