Reading Time: 2 minutes
Ap Cabinet Key Decisions Amaravati Capital Tax Relief Courts

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్ర భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసే పలు సంచలన నిర్ణయాలకు వేదికైంది. ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను అనుసరిస్తూ, కొత్త రాజధాని స్థానంలో ‘అమరావతి’ పేరును అధికారికంగా చేర్చాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనిపై మరింత లోతుగా చర్చించేందుకు ఈ శనివారం అసెంబ్లీలో నాలుగు గంటల పాటు ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంట్‌లో రాజధాని చట్టబద్ధత సవరణ బిల్లును ప్రవేశపెట్టేలా ఒప్పించి, అమరావతిని శాశ్వత రాజధానిగా సుస్థిర పరచాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇది రాజధాని ప్రాంత అభివృద్ధికి , పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించడానికి ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నారు.

Crime: బీజేపీ కార్పొరేటర్ కుమారుడి దారుణాలు.. 25 మంది బాలికలపై లైంగిక వేధింపులు..

రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలపై పేరుకుపోయిన వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తూ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది సామాన్య ప్రజలకు , గృహ యజమానులకు పెద్ద ఊరట లభించనుంది. విద్యా రంగానికి సంబంధించి కూడా కేబినెట్ పలు కీలక అనుమతులు మంజూరు చేసింది. నీరుకొండలో ఉన్న ఎస్ఆర్ఎం (SRM) వర్సిటీలో 60 మీటర్ల ఎత్తు వరకు అకాడమిక్ భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కుప్పం బాలికల పాఠశాలలో విద్యార్థినుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పీఈటీ, నర్స్ , రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది.

West Bengal Elections: మమతా బెనర్జీ ఇలాఖాలో బీజేపీ ‘‘శ్రీరామ నవమి’’ ర్యాలీ..

న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు , సామాన్యులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త జూనియర్ , సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. పారిశ్రామిక , వాణిజ్య పరంగా కూడా కొన్ని కీలక రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా వడ్డీల సంఘాలకు ప్రాధాన్యత ఇస్తూ ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం సినరేజ్ ఫీజుల్లో 50 శాతం భారీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇది స్థానిక పారిశ్రామికవేత్తలకు , కార్మికులకు ఎంతో మేలు చేకూరుస్తుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ హితమైన ఇంధన వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయాలని, అలాగే ప్రతి నియోజకవర్గంలో ‘సూర్యఘర్’ పథకం కింద సౌర విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించి పాలనలో తనదైన ముద్ర వేసింది.