Reading Time: < 1 minute
Faf Du Plessis Comments Gautam Gambhir Villain Leadership Team India Coach

Faf du Plessis: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టీమిండియా కోచ్‌ గౌతమ్ గంభీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థుల దృష్టిలో గౌతమ్ గంభీర్ ‘విలన్’లా కనిపిస్తారన్నాడు. కానీ.. హెడ్ కోచ్‌గా భారత క్రికెట్‌లో కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. గంభీర్ తన దూకుడు స్వభావంతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడతారని, నాయకుడిగా ఆయన నెలకొల్పిన ప్రమాణాలు అద్భుతమన్నాడు. జియో స్టార్‌ (JioStar) లో మాట్లాడిన డు ప్లెసిస్.. గంభీర్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. “గంభీర్ కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రెండు ఐపీఎల్ టైటిళ్లను, మెంటర్‌గా 2024లో మరో టైటిల్‌ను అందించారు. కోచ్‌గా అతడి హయాంలో భారత్ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2026లో టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ ప్రయాణంలో ప్రజలు తన గురించి జనాలు ఏం అనుకుంటున్నారో గంభీర్ పట్టించుకోలేదు. ప్రమాణాలకు అనుగుణంగా ముందుకు సాగడం ప్రశంసనీయం. నేను గంభీర్‌తో కలిసి ఆడలేదు, కానీ ప్రత్యర్థిగా ఆడినప్పుడు ఆయన ఎప్పుడూ కథలో విలన్‌లానే కనిపిస్తారు. అయితే ఆ విషయాన్ని మనం గౌరవించాలి. ఆయనకు ఎవరితోనూ మంచి అనిపించుకోవాలనే తపన ఉండదు, కేవలం గెలవాలనే పట్టుదల మాత్రమే ఉంటుంది. ఒక నాయకుడిగా డ్రెస్సింగ్ రూమ్‌లో క్రమశిక్షణను, జవాబుదారీతనాన్ని పెంచడమే గంభీర్ పని. మంచి నాయకులు చేసేది కూడా అదే.” అని పేర్కొన్నాడు. వ్యక్తిగత ఇమేజ్ గురించి పట్టించుకోకుండా, కేవలం జట్టు విజయాల కోసమే పరితపించే గంభీర్ వంటి నాయకులు క్రికెట్‌కు ఎంతో అవసరమని డు ప్లెసిస్ అభిప్రాయపడ్డాడు.

READ MORE: Ranveer Singh New Movie: రణవీర్ సింగ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్.. డైరెక్టర్, హీరోయిన్, టైటిల్ డీటెయిల్స్ ఇవే!